ETV Bharat / state

బెల్లంపల్లి పురపాలికలో అవిశ్వాసం రగడ - హీటెక్కిస్తున్న క్యాంపు రాజకీయాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 4, 2024, 2:30 PM IST

bellampalle Municipality
bellampalle Municipality

No Confidence Motion in Bellampalli Municipality : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో క్యాంపు రాజకీయాలు వేడిపుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు అవిశ్వాసంలో నెగ్గేందుకు ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత ఛైర్​పర్సన్ జక్కుల శ్వేత, వైస్ ఛైర్మన్ బత్తుల సుదర్శన్‌ను గద్దె దించేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పడు ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

No Confidence Motion in Bellampalli Municipality : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఓవైపు బీఆర్ఎస్‌ కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. మరోవైపు అవిశ్వాసానికి ( No Confidence Motion) సమయం సమీపిస్తుండడంతో ఇరు పార్టీల నేతలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఈరోజే గులాబీ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ప్రత్యేక బస్సులో శిబిరానికి తరలి వెళ్లారు. దాదాపు 20 మంది క్యాంపునకు వెళ్లినట్లు సమాచారం. భారత్ రాష్ట్ర సమితి శిబిరం నుంచి ఛైర్మన్ అభ్యర్థిగా గోసిక రమేశ్‌, వైస్ ఛైర్మన్ అభ్యర్థిగా అప్సర్ బరిలో ఉండేందుకు నిర్ణయించారు.

కాంగ్రెస్‌ వైపు 12 మంది కౌన్సిలర్లు : మరోవైపు ఎన్నికలకు ముందే ఐదుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల మున్సిపల్ ఛైర్​పర్సన్ జక్కుల శ్వేతతో పాటు మరో ముగ్గురు గులాబీ పార్టీ కౌన్సిలర్లు, ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. మున్సిపాలిటీలో అధికార పార్టీ 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ప్రస్తుత ఛైర్‌పర్సన్ చేరికతో కలిపి ఈ సంఖ్య 12కు చేరుకుంది.

మళ్లీ తెరపైకి పుర అవిశ్వాసాలు - గవర్నర్ ఆమోదం పొందని అవిశ్వాసాల సవరణ బిల్లు

No Confidence Motion in Bellampalle Municipality : ఇప్పటికే జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోశ్ ఈ నెల 12న అవిశ్వాసానికి సంబంధించి సమావేశం నిర్వహించడానికి, కౌన్సిలర్లకు నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ మద్దతు కోసం, ప్రస్తుత ఛైర్మన్‌ జక్కుల శ్వేత తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు హస్తం పార్టీ మరో వర్గం తమలోని ఇద్దరు కౌన్సిలర్లను ఛైర్‌పర్సన్‌, వైస్ ఛైర్‌పర్సన్‌లుగా చేయడానికి పావులు కదుపుతున్నారు. ఫలితంగా బెల్లంపల్లిలో క్యాంపు రాజకీయాలు వేడిని పుట్టిస్తున్నాయి.

No Confidence Motions in Telangana Municipalities : మరోవైపు తెలంగాణలోని పురపాలక సంఘాల్లో మళ్లీ అవిశ్వాసాలు (No Confidence Motions in Telangana) మొదలయ్యాయి. గత కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్న అవిశ్వాసాలు శాసనసభ ఎన్నికలు హడావుడి ముగియడంతో మళ్లీ తెరపైకి వచ్చాయి. రాష్ట్రంలోని పురపాలక సంఘాల పాలకవర్గాలు అధికారంలోకి వచ్చి ఈ గతేడాది జనవరి 27తో మూడు సంవత్సరాలైంది. ఆ మరుసటి రోజునుంచే అసమ్మతి గళాలు మొదలయ్యాయి. ఛైర్మన్లపై అవిశ్వాసాలు ప్రతిపాదిస్తూ పలు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు నోటీసులు జారీ చేశారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పురపాలికల్లో రగడ - ఛైర్మన్‌లకు అవిశ్వాసం సెగ

అవిశ్వాస తీర్మానాలకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును గత ప్రభుత్వం అసెంబ్లీ ఆమోదించినా, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ ఆమోదం తెలపకపోవడంతో సవరణ బిల్లుకి చట్టబద్ధత రాలేదు. ఈలోగా కౌన్సిలర్లు అవిశ్వాసాలు ప్రవేశ పెట్టడంతో కొందరు ఛైర్మన్లు హైకోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొందారు. అవిశ్వాస తీర్మానాలకు సంబంధించి నిబంధనలు రూపొందించాలని ఇదే సమయంలో అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. అప్పట్లో శాసనసభ ఎన్నికలు అసెంబ్లీ రావడంతో అధికారులు దాన్ని పక్కన పెట్టారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగా, గవర్నర్ తన వద్ద ఉన్న సవరణ బిల్లును ఇప్పటికైన ఆమోదిస్తారా? దీనిపై ప్రస్తుత ప్రభుత్వ విధానమేమిటనే అంశాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.

పురపాలికల్లో రగడ.. ఛైర్మన్‌లపై అవిశ్వాసం నోటీసులు

సర్కార్​ వద్దకు 'పురపాలికల్లో అవిశ్వాసం'.. నెక్ట్స్‌ ఏం జరగనుందో..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.