Crop loss: భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలు.. 500 ఎకరాలు వర్షార్పణం

author img

By

Published : Sep 8, 2021, 12:15 PM IST

Crop loss due to heavy rains, mancherial Crop loss

రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాలు జలమయమయ్యాయి. చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో వందల ఎకరాల్లో పంట నీటమునిగింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.

రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వాగులు, వంకలు పొంగిపొర్లి సమీపంలోని పంటపొలాలు నీటమునిగాయి. అన్నారం సరస్వతీ బ్యారేజీ బ్యాక్ వాటర్ వల్ల మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని సుందరశాల, నరసక్కపేట, పోకూరు గ్రామాల్లో దాదాపు నాలుగు వందల ఎకరాల్లోని పత్తి, వరి, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో కోటపల్లి మండలం రాంపూర్ గ్రామంలో రెండు వందల ఎకరాల పొలాలు నీట మునిగిపోగా అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు

భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలు

వర్ష బీభత్సం

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జోరుగా కురుస్తున్న వర్షాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. పలుచోట్ల వాగులను దాటే క్రమంలో ప్రజలు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేటలో వాగులో చిక్కుకొని తండ్రీకుమారుడు మృతి చెందారు. వంతెనపై నుంచి వాగు దాటుతుండగా వరద ప్రవాహానికి ఇద్దరూ కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న అధికారులు గల్లంతైన వారి ఆచూకీ కోసం చర్యలు చేపట్టారు. మల్లన్నపేట వద్ద వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు గొల్లపల్లి మండలం నందిపల్లి వాసులైన గంగమల్లు, విష్ణువర్ధన్​లుగా గుర్తించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.