ETV Bharat / state

బీసీ హాస్టల్​లో వీడ్కోలు పార్టీ.. చికెన్​, బీర్లతో విద్యార్థుల దావత్​..

author img

By

Published : Apr 20, 2022, 4:36 PM IST

Students Beer Party: పదో తరగతి, కింది తరగతి విద్యార్థులు హాస్టల్​లో మద్యం, మాంసంతో విందు చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్​లో చోటుచేసుకుంది. ఎవ్వరికీ తెలియకుండా విద్యార్థులు గుట్టుగా చేసుకున్న పార్టీకి సంబంధించిన ఫొటోలు సోషల్​మీడియాలో వైరల్​ కావటంతో విషయం బయటకు పొక్కింది.

bc boys
bc boys hostel students held party with beers and chicken at dandepally

బీసీ హాస్టల్​లో వీడ్కోలు పార్టీ.. చికెన్​, బీర్లతో విద్యార్థుల దావత్​..

Students Beer Party: మంచిర్యాల జిల్లా దండేపల్లిలోని బీసీ బాలుర హాస్టల్లో విద్యార్థులు మాంసం, మద్యంతో విందు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి.. చర్చనీయాంశంగా మారింది. హస్టల్​లోని పదో తరగతి విద్యార్థులు, కింది తరగతి విద్యార్థులు కలిసి ఆదివారం(ఏప్రిల్​ 17న) రాత్రి వీడ్కోలు పార్టీ చేసుకుంటామని వార్డెన్​ను కోరారు. పిల్లల కోరికను మన్నించిన వార్డెన్.. వంటమనిషి విజయ చేత రాత్రి పూట భోజనంలోకి​ చికెన్​ చేయించారు. విద్యార్థులందరూ.. భోజనం చేసిన తర్వాత సుమారు తొమ్మిదిన్నర సమయంలో వార్డెన్​ ఇంటికి వెళ్లిపోయాడు. వంటమనిషి విజయ.. హస్టల్​లోనే పక్కన గదిలో పడుకుంది.

అప్పుడు హాస్టల్​లోని విద్యార్థులు.. బయట మిత్రులతో హాస్టల్ వెనుక నుంచి బీర్ బాటిల్స్ తెప్పించుకున్నారు. అందరూ కూర్చొని చికెన్​తో పాటు మద్యం సేవించారు. అయితే విద్యార్థులు మద్యం సేవిస్తున్నప్పుడు తీసుకున్న ఫొటోలను.. కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయటంతో విషయం బయటపడింది. ఆ ఫొటోలు కాస్తా.. వైరల్​ కావటంతో అధికారుల దృష్టికి వెళ్లింది. విషయం తెలుసుకున్న అసిస్టెంట్ బీసీ డెవలప్​మెంట్​ ఆఫీసర్​ భాగ్యమతి.. హాస్టల్​లోని విద్యార్థులను విచారించారు. తల్లిదండ్రుల ముందే.. పిల్లలకు కౌన్సెలింగ్​ ఇచ్చారు.

"హస్టల్​లో విద్యార్థులు మద్యం సేవించారన్న విషయం తెలియగానే.. పిల్లలను విచారించాను. పదో తరగతి విద్యార్థులు, కింది తరగతి విద్యార్థులు వీడ్కోలు పార్టీ చేసుకున్నట్టు తెలిపారు. అందుకోసం వార్డెన్​తో మాట్లాడి పర్మిషన్​ తీసుకున్నారు. వంటమనిషి విజయతోనే చికెన్​ వండించుకున్నారు. హాస్టల్​ వార్డెన్​ బయటికి వెళ్లిపోయాక.. బయటి మిత్రులతో బీరు బాటిళ్లు తెప్పించుకుని సేవించినట్టు విద్యార్థులు తెలిపారు. హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం వల్లే వసతి గృహంలో విద్యార్థులు మద్యం సేవించారు. నిర్లక్ష్యంగా ఉన్న వార్డెన్​పై చర్యలు తీసుకుంటాం." - భాగ్యమతి, అసిస్టెంట్​ బీసీ డెవలప్​మెంట్​ ఆఫీసర్​

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.