ETV Bharat / state

సమీక్షలో సన్నాయి మేళం.. ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి

author img

By

Published : Feb 26, 2020, 6:08 PM IST

Updated : Feb 26, 2020, 7:54 PM IST

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమీక్షలో మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ గొడవ పడ్డారు. సమీక్ష నిర్వహించే ముందు ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వరా అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. ముందుగా అనుకున్న సమావేశమేగా అంటూ మంత్రి బదులివ్వగా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.

mla fire on minister and collector
కలెక్టర్‌ ముందు గొడవ పడ్డ ఎమ్మెల్యే, మంత్రి

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ఎస్ఆర్ఎస్పీ, చిన్న తరహా నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. "స్థానిక ఎమ్మెల్యే రాకుండా మీ అంతట మీరే సమీక్షా పెట్టుకుంటే ఎలా, స్థానిక సమస్యలు మీకు తెలుసా... నాకు తెలుసా" అని ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "నేను ఆర్‌ఈసీలో చదువుకున్నాను, ఎర్రబస్ ఎక్కి రాలేదు" అంటూ మంత్రి, అధికారులపై మండిపడ్డారు. రివ్యూ అంటే కేవలం ఫోటోలు దిగి మీటింగ్ ముగించడానికే పరిమితమా అని ప్రశ్నించారు.

క్షమాపణ చెప్పిన కలెక్టర్‌

ఉదయం 11 గంటలకు సమీక్ష నిర్వహించుకుందామని అందరి ముందే అనుకున్నాం కదా అని మంత్రి చెపుతున్నా ఎమ్మెల్యే .. మంత్రి మాటలను వినలేదు. ఎమ్మెల్యేను శాంతపరిచేందుకు కలెక్టర్ వి.పి గౌతమ్ క్షమాపణ చెప్పారు.

గడ్డి పీకుతున్నారా?
"మైసమ్మ చెరువుకు ఎస్‌ఆర్‌ఎస్పీ నీళ్లు ఎందుకు రావడం లేదు? టెండర్లు ఎందుకు పిలువడం లేదు? నా సొంత పైసలతో కాలువ తవ్వా" అంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. "ప్రజా సమస్యల కోసమే ఈ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశాం.. మీరు మాట్లాడిందే కరెక్ట్ అనుకుంటే ఎట్లా?" అని మంత్రి అడగ్గా.. ఎమ్మెల్యే మీరే మాట్లాడండి అని సమాధానం చెప్పారు. సమస్యలు పరిష్కరించాలని మంత్రికి రెండు సంవత్సరాల నుంచి చెప్తున్నా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.

కలెక్టర్‌ ముందు గొడవ పడ్డ ఎమ్మెల్యే, మంత్రి

ఇవీ చూడండి: విద్యార్థిని తండ్రిపై పోలీసు దాష్టీకం.. బూటుకాలితో..!

Last Updated :Feb 26, 2020, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.