ETV Bharat / state

ఘనంగా కల్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

author img

By

Published : Feb 27, 2021, 12:12 PM IST

srivari bramhostaval at madira in khammam district
ఘనంగా కల్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

కల్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఖమ్మం జిల్లా మధిరలో ఘనంగా జరుగుతున్నాయి. స్వామి వారిని గరుడ వాహనంపై పుర వీధుల్లో ఊరేగించారు.

ఖమ్మం జిల్లా మధిర వర్తక సంఘం కల్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వేద పండితులు రామానుజాచార్య స్వామి, మురళి కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో గోవింద పట్టాభిషేకం నిర్వహించారు.

స్వామి వారిని గరుడవాహనంపై పుర వీధుల్లో ఊరేగించారు. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో 178 కరోనా కేసులు, ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.