ETV Bharat / state

రైతులకు మద్దతుగా సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్ర

author img

By

Published : Dec 15, 2020, 11:02 PM IST

దిల్లీలో రైతుల దీక్షకు మద్దతుగా ఖమ్మం జిల్లాలో సీపీఐ నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. చేతులకు బేడీలు వేసుకుని, ఉరితాళ్లతో నిరసన వ్యక్తం చేశారు. నేలకొండపల్లి నుంచి ఖమ్మం కలెక్టరేట్​ వరకు పాదయాత్ర చేపట్టారు.

Padayatra under the auspices of CPI in support of farmers strike khammam dist
రైతులకు మద్దతుగా సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్ర

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ ఖమ్మం సీపీఐ నాయకులు పాదయాత్ర చేపట్టారు. ఆ పార్టీనేత కర్నాటి భానుప్రసాద్​ ఆధ్వర్యంలో రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. చేతులకు బేడీలు వేసుకుని, మెడకు ఉరితాళ్లు బిగించుకుని, పురుగు మందుల డబ్బాలతో ఆందోళన నిర్వహించారు.

జిల్లాలోని నేలకొండపల్లి నుంచి కలెక్టరేట్​ వరకు పాదయాత్ర చేశారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాగం హేమంతరావు డిమాండ్​ చేశారు. కార్పొరేట్ల కోసం రైతులకు అన్యాయం చేయటం సరైంది కాదన్నారు. చట్టాలను ఉపసంహరించుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని సీపీఐ నాయకులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:ప్రణయ్​ హత్యకేసు విచారణపై హైకోర్టు స్టే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.