ETV Bharat / state

ఖమ్మంలో ముస్తాబవుతున్న కొత్త బస్టాండ్

author img

By

Published : Mar 21, 2021, 11:54 AM IST

new rtc bustand will open in khammam
ఖమ్మం నగర సిగలో మరో కలికితురాయి చేరబోతోంది

అభివృద్ధిలో సరికొత్త పథంలో దూసుకుపోతున్న ఖమ్మం నగర సిగలో మరో కలికితురాయి చేరబోతోంది. ఇప్పటికే అభివృద్ధిలో రాష్ట్రంలోని ఇతర పట్టణాలు, నగరాలకు ఆదర్శంగా నిలుస్తున్న ఖమ్మం నగరంలో సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న నూతన బస్టాండ్ మరో మణిహారంగా మారుతోంది. రాష్ట్రంలోనే ఆధునిక బస్టాండ్ గా ఖ్యాతిగాంచిన హైదరాబాద్ ఎంజీబీఎస్ తర్వాత అత్యాధునిక సౌకర్యాలతో, ఆధునిక హంగులతో కొలువుదీరుతున్న ప్రయాణప్రాంగణం మరికొద్దిరోజుల్లో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఒకేసారి 60 బస్సులు నిలిచే సదుపాయంతో...అండర్ గ్రౌండ్ పార్కింగ్ సదుపాయంతో రూపుదిద్దుకుంటున్న నూతన బస్టాండ్ పై ఖమ్మం నుంచి మా ప్రతినిధి లింగయ్య అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం.

ఖమ్మం నగరంలోని ఎన్నెస్పీ క్యాంపు బైపాస్ ప్రాంతంలో నూతన బస్టాండు మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయి సేవల్ని అందించబోతోంది. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్ ప్రయాణ ప్రాంగణాల తర్వాత ఆధునిక బస్టాండుగా రూపుదిద్దుకుంటున్న ఈ కొత్త బస్టాండు ప్రయాణికులకు విశేషమైన సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఎంజీబీఎస్, జేబీఎస్ లో మొత్తం 60 ప్లాట్ ఫాం లు ఉండగా..ఖమ్మం ప్రయాణ ప్రాంగణం 30 ప్లాట్ ఫాంలతో కొలువుదీరింది. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులన్నీ కొత్త ప్రయాణ ప్రాంగణం నుంచే రాకపోకలు సాగించేలా...ఒకేసారి 60 బస్సులు కొలువుదీరేలా కొత్త బస్టాండ్ నిర్మితమవుతోంది.

సకల సౌకర్యాలు

ఎక్కువ బస్సులు రాకపోకలు సాగించడంతోపాటు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఉండేలా కొత్త ప్రయాణ ప్రాంగణం నిర్మాణం చేపడుతున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే బస్సులు, రాజమండ్రి, విజయవాడ, విశాఖ, వరంగల్, కరీంనగర్ ప్రాంతాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అన్ని బస్సులు రానున్న రోజుల్లో కొత్త బస్టాండ్ నుంచే రాకపోకలు సాగించనున్నాయి. ఇందుకోసం బస్టాండ్​లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏయే బస్సులు ఎక్కడ ఆగుతాయి.

ఈనెల 27న ప్రారంభం

ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయనేది ఎల్ఈడీ బోర్డులతో ప్లాట్​ఫాం నిర్మాణాలు చేపట్టారు. ప్రయాణికులకు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడా లేని విధంగా అండర్ గ్రౌండ్ స్థలంలో వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి..రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాతి బస్టాండ్ ప్రయాణ ప్రాంగణం నిలుస్తుండటం గర్వంగా ఉందంటున్నారు....రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్. ఈనెల 27న పురపాలక మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ నూతన బస్టాండ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికారులు మిగిలిన పనులను చకచకా పూర్తిచేసే పనుల్లో నిమగ్నమయ్యారు.

ఇదీ చదవండి: కొవిడ్ ఉద్ధృతి.. రాష్ట్రంలో మరో 394 కేసులు, 3 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.