ETV Bharat / state

Munneru Development Project : మున్నేరు మణిహారం.. వరద కష్టాలకు చెక్ పెట్టేందుకు 'రివర్ ఫ్రంట్'

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2023, 7:19 AM IST

Munneru
Munneru Development Projects

Munneru Development Project : ఖమ్మంలో మున్నేరు వరద బాధితుల కష్టాలకు శాశ్వతంగా చెక్‌ పెట్టేలా మరో కీలకమందడుగు పడింది. రూ.690 కోట్లతో 8 కిలోమీటర్ల పొడవులో మున్నేరుకు ఇరువైపులా ఆర్​సీసీ రక్షణ గోడల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. వరదకు అడ్డుకట్ట వేయడంతోపాటు మున్నేరును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణకు చకచకా అడుగులు పడుతున్నాయి.

Munneru Development Project మున్నేరు మణిహారం.. వరద కష్టాలకు చెక్ పెట్టేందుకు రివర్ ఫ్రంట్

Munneru Development Project : గత చరిత్రలో ఎన్నడూలేని విధంగా జూలై 27న భారీ వరదలు మున్నేరు (Munner Lake Floods) ప్రభావిత ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. వరద ఉద్ధృతితో మున్నేరు పరివాహక ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో.. మున్నేరు వరద కష్టాల నుంచి బాధితులకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.

Munneru River Front in Khammam : ఆగస్టులో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో మున్నేరుకు రెండువైపులా ఆర్​సీసీ రక్షణ గోడల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. తొలుత బొక్కలగడ్డ, సారధినగర్ ప్రాంతాల్లో రక్షణ గోడలు నిర్మించేందుకు రూ.146 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తర్వాత ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి మంత్రి పువ్వాడ(Minister Puvvada Ajay)తోపాటు సాగునీటి పారుదల శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.

Munneru Checkdams Khammam : నగరంలో మున్నేరు ప్రవహించే అన్ని ప్రాంతాల్లో రెండువైపులా రక్షణ గోడలు విస్తరించి ప్రజలకు వరద సమస్యలు లేకుండా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సాగునీటి పారుదల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆదేశాలు జారీ చేశారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు క్షేత్రస్థాయి పరిశీలనకు ఆదేశించగా.. ఆగస్టులో ఈఎన్​సీ మురళీధర్ రావు ఖమ్మం మున్నేరు ప్రాంతంలో పర్యటించి నివేదిక అందజేశారు.

Munneru Lake Floods 2023 : సాగునీటి పారుదల శాఖ అధికారుల నివేదికల పరిశీలించిన అనంతరం మున్నేరుపై ఆర్​సీసీ రక్షణ గోడలు నిర్మించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఖమ్మంలో మొత్తం 8 కిలోమీటర్ల పాటు ఆర్ సీసీ రక్షణ గోడలు నిర్మించేందుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇందులో భాగంగా మొత్తం రూ690 కోట్ల అంచనాతో ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. నది అంచు నుంచి 8 కిలోమీటర్ల పొడవులో 33 అడుగులకు పైన ఆర్​సీసీ గోడలు నిర్మిస్తారు.

Khammam Floods 2023 : శాంతించిన మున్నేరు.. కోలుకుంటున్న ఖమ్మం.. ఇళ్లకు చేరుకుంటున్న బాధితులు

రక్షణ గోడపైన 3.3 అడుగుల బేస్ ఉండేలా నిర్మాణం చేపడతారు. రక్షణ గోడకు ఇరువైపులా మురుగు కాల్వల నిర్మాణం చేపట్టనున్నారు. ప్రకాశ్​నగర్ చెక్ డ్యాం తర్వాత మురుగు కాల్వలు కలిసేలా నిర్మాణం చేపడతారు. పోలెపల్లి నుంచి ప్రకాశ్ నగర్ వంతెన వరకు మున్నేరుకు రెండు వైపులా రక్షణ గోడలు నిర్మించనున్నారు. రక్షణ గోడల నిర్మాణానికి అతి తక్కువ భూసేకరణ ఉండేలా, ఎక్కడా ఇళ్లు నష్టపోకుండా త్వరలోనే కార్యాచరణ మొదలు కానుంది. మున్నేరు రివర్ ఫ్రంట్ ఖమ్మం సిగలో మరో కలికితురాయిగా మారుతుందని మంత్రి పువ్వాడ అజయ్ హర్షం వ్యక్తం చేశారు. మంత్రిగా నాలుగేళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా కేసీఆర్ కానుకగా ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.

మరోవైపు.. రూ.690 కోట్లతో ఆర్​సీసీ రక్షణ గోడల నిర్మాణంతోపాటు మున్నేరును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేలా కార్యాచరణ చేపట్టనున్నారు. ఇందుకోసం ఇప్పటికే మున్నేరుపై ఆర్​అండ్​బీ శాఖ ఆధ్వర్యంలో రూ.180 కోట్లతో కేబుల్ బ్రిడ్డి నిర్మాణానికి ప్రస్తుతం టెండర్ ప్రక్రియ సాగుతోంది. హైదరాబాద్ దుర్గం చెరువుపై ఉన్న కేబుల్ బ్రిడ్జి తరహాలో మున్నేరుపైనా కేబుల్ వంతెన నిర్మాణం కానుంది. దీనికి తోడు మున్నేరుపై మరో మూడు చోట్ల చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టనున్నారు. ఒక్కో చెక్ డ్యాం నిర్మాణానికి రూ.10 కోట్లతో మొత్తం రూ.30 కోట్లతో పద్మావతి నగర్, రంగనాయకుల గుట్ట, గణేశ్ నగర్ ప్రాంతాల్లో చెక్‌ డ్యామ్‌లు నిర్మించనున్నారు. వీటి నిర్మాణం ద్వారా మున్నేరులో ఏడాది పాటు నీరు నిల్వ ఉండనుంది.

"రోడ్డు నిర్మాణానికి ఇచ్చిన రూ.690 కోట్లు.. చెక్​ డ్యామ్​లకు రూ.30 కోట్లు.. రూ.720 కోట్లు కేబుల్​ బ్రిడ్జ్​కి..రూ.180 కోట్లతో మున్నేరు అభివృద్ధి కాబోతుంది. ఎన్నికల అప్లికేషన్లు స్టార్ట్​ కాకముందుకే వీటికి శంకుస్థాపన చేయాలి అనుకున్నాను. మూడు చెక్​డ్యామ్​లు నిర్మించడం వల్ల 365 రోజులు నీళ్లు నిల్వ ఉంటాయి." - పువ్వాడ అజయ్, రవాణాశాఖ మంత్రి

ఖమ్మం వాసులకు ఆహ్లాదం పంచేలా పర్యాటక సొగబులు అద్దనున్నారు. చెక్​డ్యాంల నిర్మాణం పూర్తయిన తర్వాత బోటింగ్ ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. ఇలా మున్నేరు ప్రాజెక్టు కోసమే ప్రభుత్వం మొత్తం రూ900 కోట్లు కేటాయిస్తుండటం విశేషం. ఈ పనులకు అక్టోబరులో మరింత ముందడుగు పడేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Flood Effect on Khammam District : శాంతించిన మున్నేరు.. ఇళ్లకు చేరుకుంటున్న బాధితులు

MUNNERU CHECK DAM: పొంగి పొర్లుతున్న చెక్​ డ్యాం.. సంతోషంలో నగరవాసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.