ETV Bharat / state

MUNNERU CHECK DAM: పొంగి పొర్లుతున్న చెక్​ డ్యాం.. సంతోషంలో నగరవాసులు

author img

By

Published : Jun 4, 2021, 1:27 PM IST

గురువారం ఉదయం కురిసిన వర్షానికి ఖమ్మం జిల్లా మున్నేరు నది జలకళ సంతరించుకుంది. వర్షపు నీటితో వాగుపై నిర్మించిన చెక్ డ్యాం నిండిపోయి పొంగి పొర్లుతోంది.

munneru checkdam overflowing
మున్నేరు చెక్​ డ్యాంకు వరద ఉద్ధృతి

ఖమ్మం నగర పాలక సంస్థ మూడో పట్టణ ప్రాంతంలో భూగర్భ జలాలు పెంచేందుకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రత్యేక చోరవతో మున్నేరుపై నిర్మించిన చెక్‌ డ్యాం పూర్తిగా నిండింది. నిన్న ఉదయం కురిసిన వర్షానికి చెక్​ డ్యాం పూర్తిగా నిండిపోయి పొంగి పొర్లుతోంది. దీంతో నగర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆ ప్రాంత ప్రజల నీటి కష్టాలు తీర్చేందుకు మంత్రి రూ. 7.50 కోట్ల వ్యయంతో డ్యాం నిర్మించారు. మున్నేరు వాగు పరిసరాలను అభివృద్ధి చేసి వాకింగ్‌ ట్రాక్‌, బోటింగ్‌, దోబీ ఘాట్​లను మంత్రి పువ్వాడ సారథ్యంలో నిర్మించనున్నారు.

వరదనీటితో పొంగి పొర్లుతున్న మున్నేరు చెక్​ డ్యాం

ఇదీ చదవండి: Eatala resign : తెరాస సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.