ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు పటిష్ఠ ఏర్పాట్లు

author img

By

Published : Jan 15, 2023, 7:48 AM IST

BRS Public Meeting in Khammam

BRS Public Meeting in Khammam : ఈనెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు... భారత్ రాష్ట్ర సమితి పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు.. మరో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వామపక్ష పార్టీల అగ్రనేతలు హాజరుకానున్న ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్కింగ్ వ్యవస్థను సవాల్‌గా తీసుకొని పోలీసుశాఖ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది. 5,000 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు పటిష్ఠ ఏర్పాట్లు

BRS Public Meeting in Khammam : ఈ నెల18న జరగనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభ కోసం పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు దగ్గరుండీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బహిరంగసభకు భారీగా తరలివచ్చే కార్యకర్తలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా.. మొత్తం సభా ప్రాంగణం పరిసరప్రాంతాల్లో సుమారు 240 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.

Khammam BRS Public Meeting : ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని10 నియోజకవర్గాలు,సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లోని 8 నియోజకవర్గాల నుంచి..వేలాది వాహనాల్లో కార్యకర్తలు వస్తుండటంతో పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకు నియోజకవర్గాల వారీగా ఇప్పటికే పార్కింగ్ స్థలాలు గుర్తించారు. ఆ స్థలాలను చదును చేస్తున్నారు. ఆ సభకు 30,000 నుంచి 50,0000 వాహనాలు వస్తాయని అంచనావేస్తున్నారు.

నియోజకవర్గాల వారీగా పార్కింగ్‌కు క్యూఆర్ కోడ్: ఏ దారినుంచి వచ్చే వాహనాలకు అదే దారిలో సభాస్థలికి కిలోమీటరు దూరంలోనే ఆపేలా స్థలాలు గుర్తించారు. నియోజకవర్గాల వారీగా పార్కింగ్‌కు క్యూఆర్ కోడ్ కేటాయిస్తున్నారు. దేశం బాగు కోసం ముందుడుగు వేసిన కేసీఆర్‌ అండగా నిలవాలని మంత్రి జగదీశ్​రెడ్డి పిలుపునిచ్చారు. బహిరంగ సభకు వివిధ జిల్లాల నుంచి అధిరాక పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు రానున్నారు.

బహిరంగ సభను పక్కాగా జరిపేందుకు ప్రణాళికలు: సుమారు 15,000 వీఐపీ పాసులు సిద్ధంచేస్తున్నారు. సభావేదికకు ముందు.. 20,000 కుర్చీలను ప్రముఖుల కోసం కేటాయించారు. మహిళల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు సిద్ధం చేస్తున్నారు. కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా చూసేందుకు వెయ్యిమంది వాలంటీర్లు అందుబాటులో ఉంచనున్నారు. సభాస్థలి చుట్టూ మొబైల్ టాయ్‌లెట్స్ సహా మైదానం ఎల్​ఈడీ తెరలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. బహిరంగ సభను పక్కాగా జరిపేందుకు బీఆర్ఎస్ పలుకమిటీల్ని నియమించింది.

5,000 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు: పార్కింగ్ కమిటీకి ఎమ్మెల్సీ తాతా మధు, సభా వేదిక నిర్వహణకు సీనియర్ నేత గ్యాదరి బాలమల్లు వ్యవహరిస్తారు. మీడియా కోఆర్డినేషన్ కమిటీ బాధ్యులుగా టీఎస్​ఈడబ్ల్యూఐడీసీ ఛైర్మన్ శ్రీధర్‌రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్జేసీ కృష్ణను నియమించారు. నలుగురు ముఖ్యమంత్రులతోపాటు జాతీయ నాయకులు, లక్షలాది జనం తరలివస్తున్న ఈ బహిరంగ సభకు భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్‌శాఖ చర్యలు చేపట్టింది. వివిధ జిల్లాల నుంచి దాదాపు 5,000 మంది పోలీస్‌ అధికారులు, సిబ్బందిని రప్పిస్తున్నారు.

"ఈ బహిరంగ సభ ద్వారా దేశ రాజకీయాల్లో కొత్త మార్పు వస్తుంది. ఈ సభ ద్వారా ప్రజలు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. ఈ సభ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు." -జగదీశ్​రెడ్డి, మంత్రి

ఇవీ చదవండి: తెలంగాణ ప్రగతి దేశమంతటికీ విస్తరిస్తేనే 'సంపూర్ణ క్రాంతి'

'100 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తా!'.. నితిన్​ గడ్కరీ ఆఫీస్​కు బెదిరింపు కాల్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.