ETV Bharat / state

Poor Farmer Cultivation: కాడెద్దుగా తాత.. అరకతో మనవడు..

author img

By

Published : Feb 7, 2022, 5:44 PM IST

Poor Farmer Cultivation: రోజురోజుకు రైతుల కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. పంట పండించే వరకు ఓ కష్టం.. తీరా పండించిన పంటను అమ్ముకునేందుకు మరో కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం చేయడమే గగనమై పోతున్న తరుణంలో.. మరోవైపు కరోనా వెంటాడుతోంది. దీంతో వ్యవసాయం చేసేందుకు డబ్బులు లేక అనేకమంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాయా కష్టం చేసుకుందామంటే పనులు కూడా దొరకని పరిస్థితి. దీంతో ఉన్న భూమిలోనే కష్టపడి సేద్యం చేసేందుకు నడుం కడుతున్నారు. అయితే పొలం దున్నేందుకు కాడెడ్లు లేక.. అద్దెకు తెచ్చి సేద్యం చేసే స్థోమత లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ రైతు కుటుంబంలో తాత మనవడే కాడెద్దుల్లా మారి వ్యవసాయం పనులు చేస్తున్నారు.

Poor Farmer Cultivation: కాడెద్దుగా తాత.. అరకతో మనవడు..
Poor Farmer Cultivation: కాడెద్దుగా తాత.. అరకతో మనవడు..

కాడెద్దుగా తాత.. అరకతో మనవడు..

Poor Farmer Cultivation: వ్యవసాయ పనులు చేయాలంటే ఒకప్పుడు ప్రతి రైతుకు ఎడ్లు ఉండాల్సిందే. కాలక్రమంగా వచ్చిన ఆధునిక పరికరాలతో ఎడ్లు లేకుండానే సాగు పనులు సాగుతున్నాయి. వాటిని వినియోగించే ఆర్థికస్థోమత లేనివారు ఇప్పటికే నాగలి పట్టి పొలం దున్నుతున్నారు. కానీ ఎద్దులు అందుబాటులో లేక.. యంత్రాలకు ఖర్చుపెట్టే ఆర్థిక స్థోమత లేని వారి పరిస్థితి దయనీయంగానే ఉంటుంది. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.. కరీంనగర్‌ జిల్లాలోని ఓ రైతు పరిస్థితి.

వెలిచాల గ్రామంలో గాదె రాములు తమకున్న 20 గుంటల భూమిలో వేరుశనగ సాగు చేస్తున్నారు. ఎడ్లు లేకపోవటంతో తాత గాదె రాములు, మనవడితో కలిసి దౌర కొడుతున్నారు. కాడెడ్లు లేక వ్యవసాయానికి ట్రాక్టర్లు ఉపయోగిస్తుండటంతో చిన్న చిన్న పనులకు ఇలా తాత మనవడు కాడెడ్ల స్థానంలో శ్రమిస్తున్నారు. లక్షలు పెట్టి కాడెద్దులు కొనే స్థోమత తమకు లేదని వారు వాపోతున్నారు. సెలవు రోజు రాగానే మనవడు సాత్విక్ వ్యవసాయంలో సాయం చేస్తున్నాడు. దీనితో తోటి రైతులు ఈ ఇద్దరి పట్టుదలను విశేషంగా చర్చించుకుంటున్నారు.

కరువు కాలం వచ్చింది. మళ్లీ ఈ కరోనా ఒకటి వచ్చింది. ఎడ్లు కొందామంటే లక్షలు కావాల్సిన పరిస్థితి నెలకొంది. పెద్దగా పనులు ఏమన్నా ఉంటే ట్రాక్టర్​ పెట్టి దున్నిస్తున్నాం. చేసేదేమీ లేక మనవడు నేను కలిసి తిప్పలు పడుతున్నాం. -గాదె రాములు, రైతు

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.