ETV Bharat / state

జలదీక్షకు వెళ్తున్న కాంగ్రెస్​ నేతల అరెస్ట్​

author img

By

Published : Jun 13, 2020, 5:19 PM IST

Updated : Jun 14, 2020, 11:33 AM IST

పీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్​ జలదీక్షలో పాల్గొన్న నాయకలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎగువ మానేరు వద్ద జలదీక్షకు వెళ్తున్న కాంగ్రెస్​ పార్టీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యంను పోలీసులు కరీంనగర్​ పట్టణంలో అడ్డుకొని.. గృహ నిర్బంధం చేశారు.

Police Arrest Congress Leaders In KarimNagar
జలదీక్షకు వెళ్తున్న కాంగ్రెస్​ నేతల అరెస్ట్​

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎగువ మానేరు వద్ద జలదీక్షకు వెళ్తున్న కాంగ్రెస్​ పార్టీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యంను కరీంనగర్​ పోలీసులు అరెస్టు చేశారు. బయటకు వెళ్లకుండా గృహ నిర్బంధం చేశారు. నిరసన తెలియజేయడానికి వెళ్తుంటే.. పోలీసులు అడ్డుకోవడం సరికాదని ఆయన నిరసన వ్యక్తం చేశారు. ప్రజ్యాస్వామ్య దేశంలో నిరసన, దీక్షలు చేసే స్వేచ్ఛ కూడా లేదా అంటూ మండిపడ్డారు.

పెండింగ్​లో ఉన్న ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వానికి గుర్తు చేసేందుకే దీక్ష చేపట్టినట్లు ఆయన తెలిపారు. తెరాస ప్రభుత్వం తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ నేతలను గృహనిర్బంధం చేస్తుందని సత్యం ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన సొంత నియోజకవర్గానికి, బంధువులు ఉన్న నియోజకవర్గాలకు ప్రాజెక్టులు పూర్తి చేయడం సరైంది కాదని విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎక్కువ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా పదవ ప్యాకేజీ ప్రాజెక్టును పూర్తి చేయడం గురించి ఆలోచిస్తే.. సీఎం అయి ఉండి రైతులను ఎలా మోసం చేశారో అర్థమవుతుందన్నారు.

ఇదీ చదవండి: ఈనెల 17న జగన్​, కేసీఆర్​తో ప్రధాని భేటీ

Last Updated :Jun 14, 2020, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.