వానొస్తే ఆ 4 గ్రామాలకు వణుకే.. కంటిమీద నో కునుకే..!

author img

By

Published : Jul 19, 2022, 6:13 AM IST

వానొస్తే ఆ 4 గ్రామాలకు వణుకే.. కంటిమీద నో కునుకే..!
వానొస్తే ఆ 4 గ్రామాలకు వణుకే.. కంటిమీద నో కునుకే..! ()

వర్షం కురిస్తే కరీంనగర్ జిల్లాలోని ఆ నాలుగు గ్రామాల ప్రజలు వణికిపోతారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం వెళ్లదీస్తారు. నారాయణపూర్​ చెరువు కట్ట తెగిపోవడంతో.. ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గంగాధర్ మండలంలోని ముంపు గ్రామాలపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం..

వానొస్తే ఆ 4 గ్రామాలకు వణుకే.. కంటిమీద నో కునుకే..!

కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. జోరు వానలకు కట్ట తెగడంతో నారాయణపూర్, ఇస్తారుపల్లి, మంగపేట, చర్లపల్లి గ్రామాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోని వరద నీటిని ఎగువన ఉన్న నారాయణపూర్ రిజర్వాయర్​కు తరలిస్తున్నారు. వరద నీరు ఎక్కువ రావడం, సామర్థ్యానికి మించి ప్రవహించడంతో రెండు చోట్ల గండి పడింది. దీంతో దిగువన ఉన్న నాలుగు గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. వరద ప్రవాహాన్ని ముందుగా అంచనా వేయలేకపోయిన అధికారులు.. హడావిడిగా గ్రామాల్లోని ప్రజలను కట్టుబట్టలతో ఖాళీ చేయించి.. పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాసాలకు తరలించి చేతులు దులుపుకుంటున్నారే తప్ప.. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

నారాయణపూర్ రిజర్వాయర్​లో నీటి ప్రవాహం తగ్గకపోవడంతో.. గ్రామాన్ని ముంచేస్తుందేమోనన్న భయంతో నీటి పారుదల శాఖ అధికారులే రిజర్వాయర్​కు గండికొట్టారు. ఆ వరద ఉద్ధృతికి.. జాతీయ రహదారితో నారాయణపూర్​ను కలిపే రోడ్డు వరదల్లో కొట్టుకుపోగా.. పాత ఇళ్లు నేలమట్టం అయ్యాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పంట పొలాల్లో ఇసుక మేటలు వేయగా.. తాగునీటికి కటకట ఏర్పడింది.

శాశ్వత పరిష్కారం కావాలి..: వరద కారణంగా ఆయా గ్రామాల్లో రహదారులు కొట్టుకుపోయాయి. కోళ్లు, పశువులు మృత్యువాతపడ్డాయి. ఇస్తారుపల్లి వద్ద నిర్మించిన వంతెన పూర్తిగా వరదకు కొట్టుకుపోవడంతో పరిసర గ్రామాల్లో అల్లకల్లోలం ఏర్పడింది. నారాయణపూర్ రిజర్వాయర్ నీటితో ముంపునకు గురవుతున్న తమ గ్రామాలను.. ముంపు ప్రాంతాలుగా ప్రకటించాలని ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా పునరావాస కేంద్రాలకు తరలించడం కాకుండా.. ఆర్​ఆర్​ ప్యాకేజీ అందించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇవీ చూడండి..

Gadwal Forts: వానాకాలం వచ్చిందంటే చాలు.. వారి ఇళ్లకు తాళాలు

జీన్స్​ వేసుకోవద్దన్న భర్తను చంపిన భార్య.. భార్యను అలా అన్నారని ముగ్గురి హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.