ETV Bharat / state

భగీరథ పైప్​లైన్​ కోసం హరిత హారం చెట్లు తొలగించారు..

author img

By

Published : Apr 19, 2021, 12:12 PM IST

మిషన్​ భగీరథ పైపులైన్​ వేసేందుకు హరితహారం చెట్లను పీకేసిన ఘటన కరీంనగర్ జిల్లా వెలిచాలలో చోటుచేసుకుంది. పచ్చని చెట్లను తొలగించటంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

harithaharam trees demolition
హరితహారం చెట్లు తొలగించారు

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలలో నాలుగేళ్లుగా పెంచుతున్న హరితహారం చెట్లను మిషన్ భగీరథ కాంట్రాక్టర్ తొలగించటం చర్చనీయాంశంగా మారింది. వెలిచాల నుంచి సుమారు రెండు కిలోమీటర్ల రహదారిపై మొక్కలు నాటి సంరక్షించారు.

ఈ క్రమంలో మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్ వరకు నేరుగా పైపులైన్ వేసేందుకు అధికారులు పనులు చేపట్టారు. వెలిచాల అప్రోచ్ రోడ్డు పైన బాగా పెరిగిన చెట్లను ప్రొక్లేయిన్​తో తొలగించి పైపులైన్ కోసం తవ్వారు. ఈ ఘటనపై గ్రామస్థులు ఆందోళన చెందారు. రెండేళ్లుగా కాపాడిన హరితహారం చెట్లను ఒక్క రోజులో లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: మీ కుటుంబం విలువ రూ.5 వేల కంటే తక్కువా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.