ETV Bharat / state

Harishrao: 'ప్రజాసమస్యల కోసమే ఈటల రాజీనామా చేశారా?.. ఆలోచించండి'

author img

By

Published : Aug 29, 2021, 8:58 PM IST

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో మంత్రి పర్యటించారు. పట్టణంలోని వెంకటసాయి గార్డెన్‌లో పీఆర్‌టీయూటీఎస్‌ కరీంనగర్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కేసీఆర్‌ కృతజ్ఞత సభను నిర్వహించారు. పనిచేస్తున్న తెరాస ప్రభుత్వాన్ని అండగా నిలిచి ఆశీర్వదించాలని మంత్రి కోరారు.

minister harish rao meeting in huzurabad with prtu karimnagar branch
minister harish rao meeting in huzurabad with prtu karimnagar branch


తెరాస ప్రభుత్వం ఎంప్లాయిస్‌ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ అని మంత్రి హరీశ్​రావు స్పష్టం చేశారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో మంత్రి పర్యటించారు. పట్టణంలోని వెంకటసాయి గార్డెన్‌లో పీఆర్‌టీయూటీఎస్‌ కరీంనగర్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కేసీఆర్‌ కృతజ్ఞత సభను నిర్వహించారు. ఈ సభకు మంత్రి హరీశ్​రావు, ఎమ్మెల్సీలు కూర రఘోత్తంరెడ్డి, జనార్దన్‌రెడ్డి హాజరయ్యారు.

గొడుగులు ఎవరు పంచుతున్నారు..

"మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఎందుకు రాజీనామా చేశాడు..? ప్రజా సమస్యల కోసం చేశాడా..? రానున్న ఉప ఎన్నికలో ఒక వ్యక్తి గెలిస్తే తనకే లాభం. మనం గెలిస్తే వ్యవస్థకు లాభం. తెరాస ప్రభుత్వాన్ని అండగా నిలిచి ఆశీర్వదించండి. మరింతగా పని చేస్తాం. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే తెరాస ధ్యేయం. కుట్టు మిషన్లు, మాస్కులు, గడియారాలు, గొడుగులు ఎవరు పంచుతున్నారు..? ఎందుకు పంచుతున్నారు..? అనేది ఆలోచించాలి. పెట్రోల్‌, డీజీల్‌, వంటగ్యాస్‌ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచి పేదలపై మరింత భారం మోపింది. ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయాలకు పెట్టింది కేంద్రమే. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయటమంటే రాజ్యాంగాన్ని కాలరాయటమే. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు దారాదత్తం చేస్తే రిజర్వేషన్లు ఎక్కడ ఉంటాయి..?" - హరీశ్​రావు, మంత్రి

ఇదీ చూడండి:

REVANTH REDDY: చంద్రబాబును అప్పుడెందుకు పొగిడినవ్.. కేటీఆర్​ ఎట్ల గెలిచిండో యాదికిలేదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.