ETV Bharat / state

నాసిరకం ఇసుకతో చెక్ డ్యాం నిర్మాణం: సీపీఎం

author img

By

Published : Mar 11, 2021, 4:10 PM IST

నాసిరకం ఇసుకతో చెక్​ డ్యాం నిర్మిస్తున్నారని కరీంనగర్ జిల్లా సీపీఎం కార్యదర్శి గీట్ల ముకుంద రెడ్డి అన్నారు. జిల్లాలోని రామడుగు మండలం వన్నారం చెక్ డ్యాం నిర్మాణంలో నాణ్యతలేని ఇసుక వినియోగిస్తున్నారని సీపీఎం నాయకులు, గ్రామస్థులతో కలిసి నిరసన తెలిపారు.

cpm alligations on check dam construction in karimnagar district
నాసిరకం ఇసుకతో చెక్ డ్యాం నిర్మాణం: సీపీఎం

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారం చెక్ డ్యాం నిర్మాణంలో నాసిరకం ఇసుక వినియోగిస్తున్నారని సీపీఎం జిల్లా అధ్యక్షుడు గీట్ల ముకుంద రెడ్డి ఆరోపించారు. గ్రామస్థులతో కలిసి నిరసన తెలిపారు. రూ.2.1కోట్లతో చేపట్టిన చెక్ డ్యాం పనుల్లో భాగంగా నాణ్యతలేని ఇసుకను కాంక్రీట్​లో కలపుతున్నారని ఆరోపించారు.

అధికారుల పర్యవేక్షణ లోపించిందని అన్నారు. స్థానికుల నాయకులు, అధికారుల అండతో నాసికరంగా చెక్​ డ్యాం నిర్మిస్తున్నారని తెలిపారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకొని నాణ్యణతో చెక్​ డ్యాం నిర్మించాలని కోరారు.

ఇదీ చదవండి: రుణ యాప్‌ల కేసులో మరొకరు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.