ETV Bharat / state

రైతు వేదిక నిర్మాణం.. నాసిరకం పనులు

author img

By

Published : Mar 24, 2021, 2:56 PM IST

construction rythu vedika poor quality of work
రైతు వేదిక నిర్మాణం.. నాసిరకం పనులు

రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రైతువేదికల నిర్మాణంలో డొల్లతనం బయటపడుతోంది. లక్షలాది రూపాయలతో నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణ నాణ్యత ప్రమాణాలపై పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. రైతు వేదికలను అత్యధిక ప్రాధాన్యత క్రమంలో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంటే... అధికారులు,గుత్తేదారులు కుమ్ముక్కై పనులు నాసిరకంగా చేపడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ప్రారంభానికి ముందే పెచ్చులూడిపోయేలా నిర్మించిన దాఖలాలు కనిపిస్తున్నాయి.

రైతు వేదిక నిర్మాణం.. నాసిరకం పనులు

కరీంనగర్ జిల్లా దుర్శేడులో నిర్మించిన రైతు వేదిక చూడటానికి అందంగా తీర్చిదిద్దినా పనుల్లో నాణ్యతాలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 24 లక్షలతో నిర్మించిన రైతు వేదిక భవనానికి నాసిరకం సామగ్రి వినియోగించారని రైతులు వాపోతున్నారు. మూణ్నెళ్ల క్రితమే రైతు వేదిక నిర్మాణం పూర్తి చేయగా తలుపులు ఊడిపోవడం, సిమెంట్ పెచ్చులు రాలడం, టైల్స్‌కు పగుళ్లు ఏర్పడటంపై స్థానికులు మండిపడుతున్నారు. అన్నదాతల సౌకర్యార్ధం రైతు వేదిక నిర్మించారా లేక గుత్తేదారుల కోసమే నిధులు ఖర్చు చేశారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

స్థానికులు కొందరు!

గుత్తేదారులు మాత్రం నాణ్యతలో రాజీలేకుండా... పనిచేసినట్లు చెప్పుకొస్తున్నారు. అధికారుల సూచించిన సామగ్రినే ఉపయోగించామని స్పష్టం చేస్తు‌న్నారు. స్థానికులు కొందరు వేదిక పనులకు నష్టం చేకూర్చినట్లు చెబుతున్నారు.

శ్రద్ద పెట్టకపోతే

ప్రభుత్వం ఎంతో దూరదృష్టితో చేపట్టిన రైతు వేదికల నిర్మాణాలపై అధికారులు సరైన శ్రద్ద పెట్టకపోతే నష్టం మరింత పెరిగే ఆస్కారం ఉందని రైతులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి : కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.