ETV Bharat / state

విద్యుత్​ ఛార్జీల పెంపుపై కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ఆందోళన

author img

By

Published : Jun 20, 2020, 5:54 PM IST

కరీంనగర్​ జిల్లా చొప్పదండి పట్టణంలో కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విద్యుత్​ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్​ చేస్తూ కరీంనగర్​-మంచిర్యాల రహదారిపై రాస్తారోకో చేశారు.

Congress-led agitation on electricity tariff hike in karimnagar district
విద్యుత్​ ఛార్జీల పెంపుపై కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ఆందోళన

కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఆందోళన చేశారు. కరీంనగర్-మంచిర్యాల రహదారిపై రాస్తారోకో చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టాల్సిన సమయంలో ప్రజలపై భారం మోపారని ధ్వజమెత్తారు.

లాక్​డౌన్ విధించటంతో నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తరుణంలో కొత్త సమస్యను ముందు పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వ దిష్టబొమ్మను దహనం చేశారు.

ఇవీ చూడండి: గద్దర్ 'ప్రజా చైతన్య యాత్ర' పోస్టర్ ఆవిష్కరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.