ETV Bharat / state

Batti Padayatra: "మేము అధికారంలోకి వస్తే గ్యాస్​ సిలిండర్​ రూ.500లకే ఇస్తాం"

author img

By

Published : Apr 23, 2023, 5:40 PM IST

Updated : Apr 23, 2023, 6:22 PM IST

Batti Vikramarka Padayatra: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న మార్చ్​ పాదయాత్ర కరీంనగర్​ జిల్లాలో మొదలైంది. దీనిలో భాగంగా రైతులతో కలిసి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తే ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈటల రాజేందర్​ కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చేశారు. ఆయన బీఆర్​ఎస్​ పార్టీలో పని చేశారని గుర్తు చేశారు.

Bhatti Vikramarka doing padayatra
పాదయాత్ర చేస్తున్న భట్టి విక్రమార్క

కరీంనగర్​లో పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్క

Batti Vikramarka Padayatra in warangal: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ పక్షనేత బట్టి విక్రమార్క అన్నారు. సీఎల్పీ నేత తలపెట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి నుంచి ప్రారంభమయింది. మడిపల్లి మీదుగా అంకుషాపూర్‌ హన్మకొండ జిల్లా భీంపల్లికి చేరుకొంది. మార్గమధ్యలో స్థానిక ప్రజలను కలిశారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించి.. రైతులతో మాట్లాడారు.

ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తాం: వరి ధాన్యం నిల్వలను చూశారు. రైతులతో మాట్లాడారు. మోదీ హయాంలో గ్యాస్‌ ధర విపరీతంగా పెరిగిపోయాయని.. వచ్చే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రూ.500లకే గ్యాస్‌ బండను ఇప్పిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండు పడకల గదులు ఇచ్చిన ధాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. వచ్చే మా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామన్నారు. ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఇస్తామని చెప్పారు. రుణమాఫీ చేయకపోవటంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని, మేం అధికారంలోకి వస్తే ఏక కాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని బట్టి స్పష్టం చేశారు.

ఈటల ఆరోపణలు కేవలం ప్రజల దృష్టిని మళ్లించడానికే: ఇందులో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​పై విమర్శలు చేశారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ భాగస్వామ్యుడేనని ఎద్దేవా చేశారు. ఈ సమయంలో రెండు సార్లు మంత్రిగా చేశారని గుర్తు చేశారు. ప్రజల దృష్టి మళ్లించి రాజకీయంగా ఎదగటం కోసం బీజేపీ, బీఆర్​ఎస్​లు కలిసి ఒక నాటకానికి తెర తీశారని విమర్శించారు. బీఆర్​ఎస్​ పార్టీ, కాంగ్రెస్​కు డబ్బులు ఇచ్చిందని ఆరోపణలు.. కేవలం ఎన్నికల్లో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈటల ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు. ప్రజా సమస్యలను బయటకి రాకుండా ఒక నాటకం ఆడుతున్నారని పేర్కొన్నారు. బీఆర్​ఎస్​ బండి సంజయ్‌పై కేసు నమోదు చేసి అర్ధరాత్రి అరెస్టు చేయటం ఇదంతా పెద్ద హంగామని అన్నారు. ప్రజల కోసం పని చేసే పార్టీ కాంగ్రెస్‌ అని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు చేసిన అక్రమాలను వెలుగులోకి తెస్తామని బట్టీ హెచ్చిరించారు.

'అధికార ప్రభుత్వంలో ఉన్న పార్టీ డబుల్​ బెడ్​రూం ఇస్తానని చెప్పింది. ఇప్పటికి అందరికీ రాలేదు. ఇందిరమ్మ ఇళ్లు కావాలంటే కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రావాలి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీని గెలిపిస్తే తప్పనిసరిగా పేదలకి రెండు గదుల ఇందిరమ్మ ఇళ్లులు ఇప్పిస్తాం. ఇల్లు కట్టుకునేందుకు ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షలు ఇప్పిస్తాం. మేము అధికారంలోకి రాగానే రూ.500లకే గ్యాస్ అందిస్తాం. టీఎస్​పీఎస్సీ ప్రతి సంవత్సరం రిక్రూట్​మెంట్​ జరిగే విధంగా ప్రణాళిక సిద్దం చేస్తాం.'- భట్టి విక్రమార్క,సీఎల్పీ నేత

ఇవీ చదవండి:

Last Updated : Apr 23, 2023, 6:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.