ETV Bharat / state

Etela Rajender: 'రేవంత్​ ముసలి కన్నీళ్లు పెట్టుకుంటే మాకు ఒరిగేదేమీ లేదు'

author img

By

Published : Apr 23, 2023, 2:28 PM IST

Updated : Apr 23, 2023, 3:04 PM IST

Etela Rajender Comments on Revanth Reddy: ఈటల రాజేందర్​ను అడ్డుకునే దమ్ము.. రేవంత్​ రెడ్డికి ఉందా అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ సవాల్​ విసిరారు. కాంగ్రెస్​ పార్టీని విమర్శించాను తప్పితే.. తాను రేవంత్​ పేరును ఎక్కడా ప్రస్తావించలేదని​ వివరణ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఈటల.. రేవంత్​పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Etala Rajender
Etala Rajender

రేవంత్​ ముసలి కన్నీళ్లు పెట్టుకుంటే మాకు ఒరిగేదేమీ లేదు

Etela Rajender Comments on Revanth Reddy: కాంగ్రెస్​ పార్టీని విమర్శించాను తప్పితే.. తాను రేవంత్​ పేరును ఎక్కడా ప్రస్తావించలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ వివరణ ఇచ్చారు. శుక్రవారం రేవంత్​రెడ్డి మునుగోడు ఉపఎన్నికలో బీఆర్​ఎస్​ నుంచి రూ.25 కోట్లు తీసుకున్నారని ఈటల ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకు ప్రతిగా తాను ఎటువంటి డబ్బులు తీసుకోలేదని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేసి.. రేవంత్​ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈటలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి సమాధానంగా నేడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈటల రాజేందర్ మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడిపై విమర్శలు గుప్పించారు.

జాతీయ పార్టీలకు దిల్లీ కేంద్రంగా రాజకీయాలు జరుగుతాయని ఈటల అన్నారు. రాహుల్​ గాంధీపై అనర్హత వేటు వేస్తే కాంగ్రెస్​ కంటే ఎక్కువగా స్పందించిన పార్టీ బీఆర్​ఎస్​నే అని గుర్తు చేశారు. ఆరోజు సీఎం కేసీఆరే స్వయంగా చీకటి రోజు అంటూ ప్రకటన ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. రేవంత్​రెడ్డి సమస్యలపై పోరాడతాడనుకున్నా కానీ.. ఇలా కన్నీళ్లు పెట్టుకుంటాడని అనుకోలేదని అన్నారు. ధీరుడు ఎప్పుడూ.. కన్నీళ్లు పెట్టుకోరని హితవు పలికారు. కన్నీళ్లు పెట్టుకుంటూ సంస్కారం హీనంగా మాట్లాడారని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్​ను భ్రష్టు పట్టించింది కేసీఆర్​: చంద్రబాబు పంచన చేరి తెలంగాణను వ్యతిరేకించిన వ్యక్తి రేవంత్​ అని ఈటల దుయ్యబట్టారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లారని.. ప్రజల కోసం తను ఎప్పుడూ జైలుకు వెళ్లలేదని విమర్శించారు. కాంగ్రెస్​ను భ్రష్టు పట్టించింది.. నామ రూపాలు లేకుండా చేయాలని చూసింది కేసీఆర్​ కాదా అని ప్రశ్నించారు. మునుగోడులో రాజగోపాల్​రెడ్డిని ఓడించేందుకు రేవంత్​రెడ్డి అనేక ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. కోమటిరెడ్డి, జానారెడ్డి బీఆర్​ఎస్​తో పొత్తుపై పరోక్షంగా చెప్పింది నిజం కాదా అని కాంగ్రెస్​ను నిలదీశారు.

తన పదవులు ఆవిరైపోతున్నాయని ఏడ్చింది రేవంత్​ రెడ్డి అని విమర్శించారు. ఏ ఉద్యమంలో రేవంత్​ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చారో చెప్పాలని వివరణ అడిగారు. ఈ విషయంలో కాంగ్రెస్​కు, బీజేపీకి పోలికేంటి రేవంత్​ అంటూ మండిపడ్డారు. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నావు.. హుందాతనంగా వ్యవహరించాలి తప్ప తప్పుడు మాటలు మాట్లాడకూడదని హితవు పలికారు. ముసలి కన్నీళ్లు పెట్టుకుంటే తమకు ఒరిగేదేమీ లేదని.. నువ్వే పలుచన అయిపోతావని హితవు పలికారు.

పాడి కౌశిక్​ మెంటల్​: దిల్లీ లిక్కర్​ కుంభకోణంపై రేవంత్​ ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని ఈటల డిమాండ్​ చేశారు. బ్లాక్​ మెయిల్​ రాజకీయలు రేవంత్​ రెడ్డి మానుకోవాలని సూచించారు. ఈ ఈటల రాజేందర్​ను అడ్డుకునే దమ్ము రేవంత్​ రెడ్డికి ఉందా అని సవాల్​ విసిరారు. కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నేతలు ఎవ్వరూ రేవంత్​రెడ్డికి సహకరించడం లేదని చెప్పారు. తన జీవితంలో ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోలేదన్నారు. సింగరేణి, నిరద్యోగ భృతిపై కొట్లాడదాం వస్తావా రేవంత్ అంటూ పరోక్షంగా సంబోధించారు. ఈ క్రమంలోనే బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ పాడి కౌశిక్​ ఒక మెంటల్​ అని విమర్శించారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 23, 2023, 3:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.