ETV Bharat / state

సీఎంను 'బండి' సంబోధించిన తీరుపై సుమన్​ అభ్యంతరం

author img

By

Published : Dec 30, 2020, 7:51 AM IST

Updated : Dec 30, 2020, 8:35 AM IST

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ను భాజపా అధ్యక్షుడు బండి సంజయ్​ సంబోధించే తీరు సరైనది కాదని ప్రభుత్వ విప్​ బాల్క సుమన్​ వ్యాఖ్యానించారు. ఈ మేరకు కరీంనగర్​లో మీడియా సమావేశం నిర్వహించారు. ఎంపీగా ఎన్నికై.. అభివృద్ధి గురించి తప్ప అన్ని మాట్లాడుతున్నారని సుమన్​ ఎద్దేవా చేశారు.

balka suman
సీఎంను 'బండి' సంబోధించిన తీరుపై సుమన్​ అభ్యంతరం

ఉద్యమనేత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను భాజపా అధ్యక్షుడు బండిసంజయ్‌ సంబోధించే తీరుపై ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కరీంనగర్​లో మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. భారతీయ సంస్కృతి గురించి గొప్పగా చెప్పే బండి సంజయ్.. ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తిని 'పాస్‌‌పోర్ట్‌ బ్రోకర్‌'గా సంబోధించడం ఎంత వరకు సమంజసమని సుమన్​ ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న వ్యక్తులను పట్టుకొని తాము కూడా మాట్లాడగలమని అన్నారు. ఇప్పటికైనా మాట్లాడే తీరును మార్చుకుంటే మంచిదని హితవు పలికారు.

కరీంనగర్ నుంచి ఎన్నికైన ఎంపీ బండి సంజయ్​.. అభివృద్ధి గురించి తప్ప అన్నీ మాట్లాడుతున్నారని సుమన్​ ఎద్దేవా చేశారు. నిజామాబాద్ నుంచి ఎంపికైన ఎంపీ అర్వింద్.. పసుపుబోర్డు తీసుకొస్తానని బాండ్లు రాసిచ్చి ఆ విషయం తప్ప అన్నీ మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఇదీ చదవండి: 'కేసీఆర్​ తప్పుడు నిర్ణయాలతోనే ప్రజల అవస్థలు'

Last Updated : Dec 30, 2020, 8:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.