ETV Bharat / state

అన్నదమ్ములపై పడిన పిడుగు...తమ్ముడు మృతి

author img

By

Published : Oct 10, 2020, 7:01 PM IST

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అడవిలింగాలతండాలో విషాదం చోటుచేసుకుంది. సాయంత్రం కురిసిన అకాల వర్షానికి పొలంలో చెట్టు కింద ఉన్న అన్నదమ్ములపై పిడుగు పడింది. ఈ ఘటనలో తమ్ముడు అక్కడికక్కడే మృతిచెందాడు.

one person killed with lighting strike in kamareddy district
అన్నదమ్ములపై పడిన పిడుగు...తమ్ముడు మృతి

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అడవిలింగాలతండాలో పిడుగుపాటుకు ఒకరు మృతి చెందారు. తండాకు చెందిన అన్నదమ్ములు ధనావత్ సుమన్(18), వినయ్ కుమార్(14) సమీపంలోని పొలానికి వెళ్లారు. సాయంత్రం అకాల వర్షం రావడంతో ఓ చెట్టు కిందకు పరుగుతీశారు. అదే సమయంలో పిడుగు పడడంతో తమ్ముడు అక్కడిక్కడే మరణించాడు.

అన్న పరిస్థితి విషమంగా ఉండడంతో ఎల్లారెడ్డిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరే సంతానం కావడంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చూడండి:దేవునూర్​లో పిడుగు పడి రెండు ఎద్దులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.