ETV Bharat / state

ఇంటింటి ఫీవర్ సర్వే గొప్ప కార్యక్రమం: ప్రశాంత్ రెడ్డి

author img

By

Published : May 21, 2021, 9:46 AM IST

ఇంటింటి ఫీవర్ సర్వే చాలా ఉపయోగపడుతోందని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ కరోనా కాలంలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎం, వైద్యులు, జిల్లా వైద్యాధికారుల సేవలు మరువలేనివని కొనియాడారు. కామారెడ్డి కలెక్టరేట్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. జిల్లాలో కొవిడ్ పరిస్థితిపై సమీక్షించారు.

minister prashanth reddy, kamareddy covid review
కామారెడ్డిలో కరోనాపై మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష, ఫీవర్ సర్వేపై మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు

ఇంటింటి ఫీవర్ సర్వే గొప్ప కార్యక్రమమని మంత్రి ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎం, వైద్యులు, జిల్లా వైద్యాధికారులు కరోనా నివారణ కోసం నిరంతరం పని చేస్తున్నారన్నారు. వారి కష్టానికి ఫలితంగానే కామారెడ్డి జిల్లాలో 28 శాతం ఉన్న పాజిటివ్ రేటు 14 శాతానికి తగ్గిందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 200 బెడ్లు, ప్రైవేటు ఆస్పత్రుల్లో 471 పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. కలెక్టరేట్​లో సమీక్ష అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

పడకల అందుబాటు

కొవిడ్ చికిత్సలో ఆక్సిజన్ చాలా ముఖ్యమైందని, జిల్లా ఆస్పత్రిలో ఇప్పటికే 30 ఆక్సిజన్ పడకలు ఉండగా మరో 100 పడకలు, బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో 70 ఆక్సిజన్ పడకల కోసం పైప్​లైన్ ద్వారా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. శనివారం వరకు పనులు పూర్తవుతాయని చెప్పారు. దోమకొండ, మద్నూర్, ఎల్లారెడ్డి, బిచ్కుంద పీహెచ్​సీల్లో 10 చొప్పున ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేయాలని కలెక్టర్​ను ఆదేశించినట్లు తెలిపారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సూచనతో జిల్లా ఆస్పత్రిలో 5 వెంటిలేటర్లను ఏర్పాటు చేయాల్సిందిగా వైద్యాధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు.

మెరుగైన వైద్యం

ఎంపీ బీబీపాటిల్ సొంత నిధులతో జిల్లా ఆస్పత్రులకు ఒక్కొక్కటి రూ.50 వేల ఖరీదు చొప్పున 30 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్​ను అందించారని వెల్లడించారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఫీవర్ సర్వే చేయాలని మోదీ ఆదేశించారని గుర్తు చేశారు. జిల్లాలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారిని గాంధీ, కింగ్ కోఠి ఆస్పత్రులకు తరలించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని... ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని అన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, కలెక్టర్ శరత్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, ఎంపీ బీబీపాటిల్, ఎస్పీ శ్వేతారెడ్డి, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. అజయ్ కుమార్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: చివరి చూపు కోసం ఎదురుచూపులు.. తల్లడిల్లుతున్న కార్మిక కుటుంబాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.