ETV Bharat / state

Dk Aruna : రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన డీకే అరుణ

author img

By

Published : May 30, 2021, 2:01 PM IST

dk aruna started blood donation camp at gadwal
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన డీకే అరుణ్

జోగులాంబ గద్వాల జిల్లాలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (Dk Aruna) ప్రారంభించారు. రక్తం ఇచ్చిన వారికి పండ్లు అందజేశారు.

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో సేవాహి సంఘటన్​ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (Dk Aruna) ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భాజపా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై రక్తాన్ని దానం చేశారు. రక్తం ఇచ్చిన వారందరికీ డీకే అరుణ (Dk Aruna) పండ్లు పంపిణీ చేశారు. రక్త దానం చేయడం వల్ల ఆపదలో ఉన్న వారిని కాపాడవచ్చని ఆమె తెలిపారు.

కరోనా కారణంగా రక్తం ఇచ్చే వారు తక్కువై.. రక్తం నిల్వలు చాలా తగ్గిపోయాయని డీకే అరుణ అన్నారు. అందుకే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. రక్తం దానం చేసిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి : Eatala: ఒక్క ఎకరం ఎక్కువ ఉన్నా ముక్కు నేలకు రాస్తా: ఈటల సతీమణి

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.