ETV Bharat / state

లక్నవరం సరస్సుకు జలకళ... ఆనందంలో రైతులు

author img

By

Published : Aug 9, 2019, 6:03 PM IST

వర్షాలు లేక ఇబ్బందులు పడ్డ రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. జయశంకర్​ భూపాల పల్లి​ జిల్లాలోని లక్నవరం సరస్సు జలకళ సంతరించుకుంది. ఏడు అడుగులు ఉన్న గుండ్లవాగు ప్రాజెక్టు 35 అడుగులకు చేరుకుంది.

లక్నవరం సరస్సుకు జలకళ

లక్నవరం సరస్సుకు జలకళ
జయశంకర్​ భూపాల పల్లి జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సు నిండుకుండలా మారింది. 7 అడుగుల నుంచి 35 అడుగులకు చేరుకొని గుండ్లవాగు ప్రాజెక్టు జలమయమై.. మత్తడి దూకుతోంది. కొత్తగూడ ఇల్లందు అడవులలో గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు లక్నవరం సరస్సు నిండింది. దీనితో రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. రెండు నెలలు గడిచినా వర్షాలు రాకపోవడం వల్ల కొంత నిరాశ నెలకొందని రైతులు తెలిపారు. దీనితో పంటలు పండుతాయో లేదో అనే ఆందోళన ఉండేదన్నారు. నిరుత్సాహపడిన అన్నదాతలు వర్షాల వల్ల పొలం పనులు ముమ్మరంగా సాగిస్తున్నారని పేర్కొన్నారు. పొలాల్లో పనిచేసేందుకు కూలీల కొరత ఉందని వెల్లడించారు. కూలీల కొరత తప్ప ఇంకా ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.

ఇవీ చూడండి: మొక్కలకు పుట్టినరోజు..చిన్నారుల సంబురాలు.

Intro:tg_wgl_53_08_nindina_cheruv_vesthunna_naatlu_pkg_ts10072_HD
G Raju mulugu contributar

యాంకర్ : ఈ ఏడాది పంటలు పండుతాయో పాండవో రైతులు నిరాశ చెందారు. కాలం మొదలయ్యి రెండు నెలలు గడవడం తో ఇంకా వర్షాలు పడకపోవచ్చు అనే నిస్సహంతో ఉన్న రైతులు ఈ నెలల పది రోజుల నుండి వర్షాలు కురవడంతో లక్నవరం సరస్సు నిండుకుండలా మారడంతో రైతులు పొలం బాట పట్టారు.


Body:వాయిస్ : వరంగల్ జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సు నిండుకుండలా మారి 35 అడుగులు చేరుకొని గుండ్లవాగు ప్రాజెక్టు నిండుకుండలా మరి మత్తడి పోతుంది. కొత్తగూడ ఇల్లందు అడవులలో గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు లక్నవరం సరస్సు జలకళ గా మారింది. రెండు నెలలుగా ఎండలతో ఉంచిన కాలం భారీగా కురుస్తున్న వర్షాలకు రైతు కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. జూన్ మాసం లోనే నార్లు పోసుకున్న రైతులు వర్షం కోసం నింగి వైపు ఎదురు చూసిన రైతులు కురిసిన వర్షానికి రైతులు పొలాల బాట పట్టారు. కంటతడి పెట్టుకున్న సమయంలోనే లే వర్షాలు కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గోవిందరావుపేట మండలం లోని లక్నవరం, గుండ్ల వాగు, కుంటలు, చెరువులు నిండుకుండలా మారాయి. నిరుత్సాహపడిన రైతులు పొలం పనులు ముమ్మరంగా సాగిస్తున్నారు. ఒక్కసారిగా వరుణుడు కరుణించడంతో రైతులకు కు నానా తంటాలు పడుతున్నారు. ఖరీఫ్, రబీ పంటలు పండే వర్షాలు కురుస్తాయని నెమ్మదిగానే అయినా నాట్లు వేసుకుంటామని రైతులు అంటున్నారు.


Conclusion:బైట్స్ : 1, హరిబాబు రైతు
2, మహిముద్ పస్రా
3, రవి మోహన్ రైతు గోవిందరావుపేట
4, చంద్రు నాయక్ లక్ష్మీపురం
5, నరసింహ నాయక్ దుంపల్లిగూడెం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.