ETV Bharat / state

వర్షంతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

author img

By

Published : Jul 26, 2019, 4:52 PM IST

జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సింగరేణి బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. సంస్థకు సుమారు రూ.40లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.

Disruption of coal production in Singareni with rain water

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా సింగరేణి కాకతీయ ఓపెన్ కాస్ట్ సెక్టార్ 1, 2 వ గనిలోకి నీరు చేరింది. గనుల్లో నిలిచిన నీటితో 3 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సింగరేణి సంస్థకు రూ.40 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు గంట పాటు పనులు ఆగిపోయాయి. అనంతరం యథావిధిగా పనులు కొనసాగాయి.

వర్షంతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

ఇవీ చూడండి: వాతలు వచ్చేలా కొట్టిన సైకో టీచర్

sample description

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.