ETV Bharat / state

farmers protest in jangaon : 'బస్తాకు రెండు కిలోలు అదనంగా ఇచ్చేదే లేదు'

author img

By

Published : May 10, 2023, 4:13 PM IST

Updated : May 10, 2023, 4:47 PM IST

farmers protest in jangaon : ఆరుగాలం పండించిన పంట వడగళ్ల వానకు ఎంతో నష్టపోయింది. మిగిలిన ధాన్యమైనా అమ్ముకుందామని.. కొంతైనా ఊరట వస్తుందని పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే బస్తాకు రెండు కిలోలు ఎక్కువ పెట్టాలి లేదంటే కొనేదే లేదని రైస్ మిల్లర్లు రైతులను బెదిరిస్తున్నారు. ధాన్యం ఎలా ఉన్నా కొనుగోలు చేయాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ మిల్లర్లు మాత్రం రైతుల పట్ల ఇష్టారీతిన వ్యవహరంటూ నిరసనగా.. జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు.

farmers protest in jangaon
'బస్తాకు రెండు కిలోలు ఇచ్చేదే లేదు'

farmers protest in jangaon : జనగామ జిల్లా స్టేషన్ ఘన్​పూర్ డివిజన్ కేంద్రంలోని జాతీయ రహదారిపై ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు వరి ధాన్యాన్ని తగులబెట్టి ధర్నా చేపట్టారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం చెప్పినప్పటికీ మిల్లర్లు అదనంగా తరుగు పేరుతో రైతులను దోచుకుంటూ క్వింటాలుకు ఐదు కిలోలు తీస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం బస్తాకు 41 కిలోలు జోకాలని చెప్పినప్పటికీ మిల్లర్లు 42 కిలోలు ఉంటేనే తీసుకుంటామని చెప్పడంతో రైతులు ఆవేదనతో జాతీయ రహదారిపై వారు పండించిన వరి ధాన్యాన్ని తగలబెట్టారు. ప్రభుత్వం స్పందించి సకాలంలో వడ్లు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

ప్రభుత్వం చెప్పినప్పటికీ: స్టేషన్ ఘన్​పూర్ ఐకేపీ సెంటర్లో గత 15 రోజుల నుంచి రైతులు వరి ధాన్యాన్ని ఆరబోసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్యాడి మిషన్​తో ధాన్యాన్ని తూర్పారబెట్టారు. మ్యాచర్ సరిగా వచ్చినా.. మిల్లర్లు కొనుగోలు విషయంలో జాప్యం చేస్తున్నారని, రైతులు అంటున్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి పండిన పంట అమ్ముకోవడానికి మధ్య దళారులు, మిల్లర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందారు. ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పినప్పటికీ, అధికారులు మిల్లర్లతో కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని వారు ఆరోపించారు. వెంటనే జిల్లా కలెక్టర్, మంత్రి స్పందించి ప్రభుత్వ నిబంధన మేరకు ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరారు.

"కష్టపడి పనిచేసి రైతులం వడ్లు తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లో పోస్తే సెంటర్ నిర్వాహకులు బాగానే స్పష్టంగా పనిచేస్తున్నారు. వారు చెప్పినట్లుగానే బస్తాకు ఒక కిలో ఎక్కువ పెట్టాము. అయితే రైస్ మిల్లు వాళ్లు వచ్చి ఒక బస్తాకు రెండు కిలోలు వడ్లు అధికంగా పెట్టాలని.. అలా అయితేనే వడ్ల​ను దిగుమతి చేసుకుంటామని చెబుతున్నారు. నేరుగా ఐకేపీ సెంటర్​కు వచ్చినా రెండు కిలోలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అలా పెట్టేదేలేదని రైతులందరం అనుకున్నాం. ఒక బస్తాకు రెండు కిలోలు పెడితే క్వింటాలుకు 5కిలోల నష్టం జరుగుతోంది. తడిసిన ధాన్యాన్నైనా కొనాలని ప్రభుత్వం స్పష్టంగా చెప్పినప్పటికీ.. మిల్లర్లు మాత్రం ఐకేపీ సెంటర్​కు వచ్చి రెండు కిలోలు అదనంగా పెట్టాలని హెచ్చరిస్తున్నారు. వేరే రైస్ మిల్లుకు వెళ్లినప్పటికీ వాళ్లను కూడా కొనొద్దని చెబుతున్నారు. మిల్లర్లు అందరూ కుమ్మక్కై రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వం వీరిపై చర్యలు తీసుకుని స్టేషన్ ఘన్​పూర్ ఐకేపీ సెంటర్​లోని వడ్లను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం."_రైతులు

'బస్తాకు రెండు కిలోలు ఇచ్చేదే లేదు'

ఇవీ చదవండి:

Last Updated :May 10, 2023, 4:47 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.