ETV Bharat / state

తాగునీరు సురక్షితమేనా? పరీక్షించడం ఎలా?

author img

By

Published : Feb 24, 2021, 6:55 AM IST

మనం తాగుతున్న నీరు సురక్షితమేనా? దాన్ని నిర్ధారించుకోవడం ఎలా? ఈ ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంటుంది. దీనికి సమాధానమన్నట్టు తాగునీటి నాణ్యత పరీక్షలు ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి.

Drinking water is now being tested in laboratories set up in connection with the Mission Bhagiratha scheme.
తాగుతున్న నీరు సురక్షితమేనా? పరీక్షించడం ఎలా?

గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో సరఫరా చేసే తాగునీటినే పరీక్షించేవారు. మిషన్‌ భగీరథ పథకానికి అనుసంధానంగా ఏర్పాటు చేసిన ప్రయోగశాలల్లోనూ ఇప్పుడు పరీక్షలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 78 ప్రయోగశాలల్లో 16 రకాల పరీక్షలను కేవలం రూ.600కే చేస్తున్నారు. ఇందుకు అర లీటరు నుంచి లీటరు నీటిని తీసుకొచ్చి తగిన రుసుము డ్రాఫ్ట్‌ ద్వారా చెల్లించాలని జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ సబ్‌ డివిజన్‌ మిషన్‌ భగీరథ పథకం ఉప కార్యనిర్వాహక ఇంజినీరు (డీఈ) కరుణ్‌కుమార్‌ తెలిపారు.

అత్యధిక పరీక్షల నిర్ధారణకు ఒకరోజు సరిపోతుందన్నారు. ఒకటి, రెండు పరీక్షల ఫలితాలు మాత్రం రెండోరోజు అందించేలా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అన్ని పరీక్షల ఫలితాలు ఒకేసారి కావాలంటే రెండోరోజు అందిస్తామన్నారు. ప్రతి తాగునీటి వనరును ఏడాదికోసారి పరీక్షించుకోవాలని ఆయన సూచించారు.

ఇవీ చూడండి: ఇక నుంచి వారంలో ఒకసారి మాత్రమే కేసుల వెల్లడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.