ETV Bharat / state

రైతులపై కేంద్రానిది ద్వంద వైఖరి: మాజీ మంత్రి పొన్నం

author img

By

Published : Feb 10, 2021, 1:00 PM IST

రైతు ఉద్యమాన్ని అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాని ఆక్షేపించారు.

tpcc working president ponnam elligation on central government for farmers is a duplicitous attitude
రైతులపై కేంద్రానిది ద్వంద వైఖరి: మాజీ మంత్రి పొన్నం

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దులో ఆందోళన చేపడుతోన్న రైతులను కేంద్రం ఉక్కుపాదంతో అణచివేయడానికి ప్రయత్నిస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా ధర్మపురిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాని అన్నారు.

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ప్రజాస్వామ్య పద్దతిలో 80 రోజులుగా నిరసన తెలుపుతూ.. 150 మంది అన్నదాతలు మరణించినప్పటికి కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమని కాంగ్రెస్​ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. ఒక వైపు రైతులతో చర్చలు జరుపుతున్నామని చెబుతోన్న కేంద్ర ప్రభుత్వం మరోవైపు ఉద్యమం చేసేవారు రైతులే కాదని వ్యాఖ్యానించడం వారి ద్వంద వైఖరికి నిదర్శనమని తెలిపారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది డిసెంబర్​లో జరిగిన భారత్ బంద్​లో పాల్గొన్న సీఎం కేసీఆర్​ దిల్లీకి వెళ్లొచ్చిన తర్వాత మాట మార్చారని పొన్నం ఆరోపించారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తే ఆ తర్వాత తమ సత్తా ఏంటో చూపిస్తామని సవాల్​ విసిరారు.

ఇదీ చదవండి: చర్లపల్లి జైలుకు కోయిలమ్మ సీరియల్ హీరో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.