Vegetables cultivation: ఈ రైతుల ఆలోచన సూపర్​హిట్​​.. ఒడ్డు మీదే బండెడు కూరగాయలు..!

author img

By

Published : Nov 26, 2021, 9:03 AM IST

Vegetables cultivation

సాగులో సరికొత్త పంథా ఎంచుకున్నారు ఆ రైతులు. సాంప్రదాయ పంటలు పండిస్తూనే.... రోజువారీ ఖర్చుల కోసం కూరగాయల(vegetables farming) పండిస్తున్నారు. పొలం గట్లపైనా సాగు చేస్తూ... వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు జగిత్యాల జిల్లా చింతలపేట రైతులు. లాభాలు గడిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

New trend in Vegetables cultivation: ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశాంటుతున్న వేళ సాగులో సరికొత్త పంథా ఎంచుకున్నారు. రోజూ వారి అవసరాలు తీర్చే కూరగాయలను పొలం గట్లపైనా సాగు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం చింతలపేటలో కొందరు రైతులు విభిన్నంగా సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతరపంటలు(farming on Intercrops in fields) సైతం పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పొలం చుట్టూ ఉన్న గట్టును సైతం ఉపయోగించుకుని కూరగాయలు పండిస్తున్నారు. ఖాళీ స్థలాన్ని వదిలేయకుండా తీగజాతి మెుక్కల్ని పెంచుతున్నారు. గ్రామంలో ఎక్కువగా వరి, పసుపు, మొక్కజొన్న, సోయా, చెరుకు తదితర పంటలను సాగు చేస్తుంటారు. అధిక పెట్టుబడులు పెట్టి ఫలితాలు పొందాలంటే సమయం పడుతుంది. ఈ క్రమంలో అంతరపంటలుగా కూరగాయలు వేస్తూ... రోజువారీ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు.

ప్రధానంగా టమాట, బెండ, వంకాయ, దొండకాయ, కాకర, బీర వంటి కూరగాయలను(farming vegetables as Intercrops) పండిస్తున్నారు. తీగ జాతి కూరగాయల కోసం చిన్న పందిళ్లు వేసి సాగు చేస్తున్నారు. పెద్ద పందిళ్లు వేస్తే కాపు తక్కువగా వస్తున్నందునా.... ఈ విధంగా సాగు చేస్తున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు డబ్బులు చేతికి అందుతున్నాయని... ఖర్చులకు ఇబ్బందులు తప్పాయని చెబుతున్నారు. ఒకే పంటపై ఆధార పడకుండా... మార్పులు చేసుకుంటూ ముందుకెళితే లాభాలు పొందవచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.... ఈ రైతుల ఆలోచన మంచి ఆదాయం తెచ్చిపెడుతుంది. ప్రతి రైతు ఓకే పంటపై ఆధారపడకుండా మార్పులు చేసుకుంటూ సాగులో ముందుకెళితే మున్ముందు మంచి లాభాలు పొందవచ్చని ఈ ఆదర్శ రైతులు అభిప్రాయపడుతున్నారు.

"నాకు ఐదెకరాల సాగు భూమి ఉంది. అందులో పసుపు, వరి పంటలు వేశాం. చిన్న పందిర్లు వేసి దొండ వేసినాం. అలాగే గెట్లపైనా బీరకాయలు పంట వేసినాము. ఆర్గానిక్ పద్ధతిలో తీగ పంటలు వేశాం. దొండ, టామాటా, వంకాయ, మిర్చి లాంటి పంటలు వేసినా. ఆర్గానిక్ పద్దతిలో సాగు చేస్తే ఎలాంటి రోగాలు రావు. అంతర పంటలు వేయడం అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది." - గురిజాల రాజారెడ్డి , రైతు

"నాకు ఎనిమిదెకరాల భూమి ఉంది. అందులో 5 ఎకరాల వరి, రెండు ఎకరాల పసుపు, ఒక ఎకరా చెరకు వేసినా. అందులోనే అంతర పంటలుగా కూరగాయలు సాగు చేస్తున్నాం. మాకు రోజూ వారి ఖర్చులయ్యే కూరగాయలను పండిస్తున్నాం. అలాగే మేం కూరగాయలు అమ్ముతూ పై ఖర్చులు సంపాదిస్తున్నాం." - శ్రీనివాస్ రెడ్డి, రైతు


ఇదీ చూడండి:

Oil palm cultivation telangana 2021: ఆయిల్​పాంతో లాభాలంట.. సదుపాయాలు మాత్రం కల్పించరంట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.