ETV Bharat / state

Women Welfare celebrations : దశాబ్ది వేడుకల్లో భాగంగా నేడు మహిళా సంక్షేమ దినోత్సవం

author img

By

Published : Jun 13, 2023, 8:41 AM IST

Women Welfare Celebrations in Hyderabad : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. రోజుకో శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఈ ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో భాగంగా ఇవాళ మహిళా సంక్షేమ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా జరపనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Women
Women

దశాబ్ది వేడుకల్లో భాగంగా నేడు మహిళా సంక్షేమ దినోత్సవం

Women Welfare Celebrations in Telangana : రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా మహిళా సంక్షేమ దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం.... అతివలను భాగస్వామ్యం చేసేలా చర్యలు చేపట్టింది. స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరగనున్న వేడుకల్లో మంత్రులు పాల్గొననుండగా.... రాష్ట్రంలో నియోజకవర్గస్థాయిలో మహిళా సదస్సులు జరగనున్నాయి.

Telangana Decade Celebrations 2023 : రాష్ట్రంలో కొనసాగుతున్న ఆవిర్భావ దశాబ్ది వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. జూన్‌ 2న ప్రారంభమైన ఉత్సవాలు.... ఈ నెల 22 వరకు 21రోజుల పాటు రోజుకో శాఖ చొప్పున అధికార యంత్రాంగం కృషితో.... ప్రజాభాగస్వామ్యంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. తొమ్మిదేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను రంగాల వారీగా ప్రజల ముందు నివేదిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవంగా రాష్ట్రవ్యాప్తంగా జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌ సహా అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమాలకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనున్నారు.

మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి మహిళా సంక్షేమ దినోత్సవం వేదికగా ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు. బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు పింఛన్లు, కల్యాణలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, పౌష్టికాహారం, కేసీఆర్​ కిట్, ఆరోగ్య మహిళ, పోలీసు శాఖలో 33 శాతం రిజర్వేషన్, మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్, మహిళలకు వీఎల్​ఆర్​, షీ-టీమ్స్, వీ-హబ్ ఏర్పాటు, మహిళా ఉద్యోగినులకు ప్రసూతి సెలవులు పెంపుతో పాటు ప్రభుత్వం తొమ్మిదేళ్ల కాలంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించనున్నారు.

Women Welfare Celebrations in Telangana Today : అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, ఇతర మహిళా ఉద్యోగులకు వేతనాలు పెంచిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలని నిర్ణయించారు. మహిళా డిగ్రీ కళాశాలలను విరివిగా ఏర్పాటు చేసిన విషయాన్ని వివరిస్తూ.... ఉత్తమ మహిళా ఉద్యోగులకు సన్మానం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వేడుకల్లో మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులందరూ భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.

కొత్త కార్యక్రమాల ప్రారంభం: హైదరాబాద్ రవీంద్ర భారతిలో మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సాయంత్రం జరిగే ఈ కార్యక్రమానికి మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్‌తో పాటు మంత్రులు సబితా, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ సునీతాలక్ష్మారెడ్డి, జీహెచ్​ఎంసీ మేయర్ విజయలక్ష్మి, రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఆకుల శ్రీలత హాజరుకానున్నారు. ఈ సందర్భంగా "కిశోరామృతం", "ఆరోగ్య లక్ష్మి" తదితర కార్యక్రమాలను మంత్రులు ప్రారంభించనున్నారు. పలురంగాల్లో ఉత్తమ ప్రతిభ కనపర్చిన బాలికలు, విద్యార్థినులు, మహిళలను మంత్రులు సత్కరించనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.