ETV Bharat / state

ఈ గణనాథులు కాస్త డిఫరెంట్​.. మీరూ ఓసారి చూసేయండి..

author img

By

Published : Sep 8, 2022, 3:20 PM IST

Variety Ganesh Idols in Telangana: రాష్ట్రవ్యాప్తంగా విభిన్న రూపాల్లో కొలువుదీరిన లంబోదరుడి ప్రతిమలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గణనాథులు చూడగానే అలరించేలా ఉండాలనే ఆలోచనతో మండపాల నిర్వాహకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. మూస పద్ధతిలో కాకుండా.. సరికొత్త హంగులను అద్దారు. ఆధునికత, సాంకేతికను జోడించి తీర్చిదిద్దిన గణనాథులను చూసి భక్తులు తన్మయత్వం చెందుతున్నారు.

Variety Ganesh Idols in Telangana
Variety Ganesh Idols in Telangana

ఈ గణనాథులు కాస్త డిఫరెంట్​.. మీరూ ఓసారి చూసేయండి..

Variety Ganesh Idols in Telangana: వినాయక చవితి వచ్చిందంటే రాష్ట్రంలో ఏ వీధి చూసినా ఆధ్యాత్మిక శోభతో అలరారుతుంది. కేవలం పూజలే కాకుండా ప్రతిమలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ తమ అభిరుచిని చాటుతున్నారు మండపాల నిర్వాహకులు. హైదరాబాద్​ పరిధిలో వివిధ ఆకృతులతో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరుని విగ్రహాలు అమితంగా ఆకర్షిస్తున్నాయి. కళాకారులు తమ సృజనాత్మకతకు మెరుగులద్ది సరికొత్తగా ప్రతిమలు రూపొందించారు. హైదరాబాద్​లో రెండేళ్లుగా కరోనాతో కళ తప్పిన మండపాలు.. మళ్లీ పూర్వవైభవం సంతరించుకున్నాయి.

మహారాజ్​గంజ్​, న్యూ ఉస్మాన్​గంజ్​, బేగంబజార్, గన్​ఫౌండ్రి తదితర చోట్ల విభిన్న రూపాల్లో ఏకదంతుడి ప్రతిమలు ఏర్పాటు చేశారు. రావణుడి తలపై ఉన్న పార్వతీ సుతుడు, విద్యుత్​కాంతుల మధ్య తాండవం చేస్తున్న వక్రతుండుడు, సంజీవిని పర్వతం ఎత్తుకున్న గజాననుడు, సింహ వాహనంపై మూషిక వాహనుడు, శివుని ఆకారంలో ఉమాసుతుడు, కృష్ణుని ఒడిలో కూర్చున్న కరివదనుడు ఇలా వివిధ రకాల్లో కొలువైన అధినాయకుడి ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి.

మండపాలకు అదనపు సొబగులు..: మండపాలకు విద్యుత్​ దీపాల అలంకరణలు భక్త హృదయాలను కట్టిపడేస్తున్నాయి. ఆయా మండపాల వద్ద సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు రంజింపజేస్తున్నాయి. నిజామాబాద్​లోనూ భారీ సెట్టింగులతో ప్రతిమలు ఏర్పాటు చేశారు. రాజస్థాన్ భవన్​లో వినాయక మండపం బయట శివాజీ విగ్రహం ఏర్పాటు చేశారు. మండపం మధ్య భాగంలో విఘ్నేషుడు, ఎడమ వైపు విష్ణువు, కుడి పక్కన పార్వతీ సమేత గణపతిని ప్రతిష్ఠించారు.

చాక్​పీస్​పై వినాయకుడు..: బాలాజీ భవన్​లో విరాటపర్వం అధ్యాయం వచ్చేలా ప్రత్యేకంగా ప్రతిష్ఠించారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసేలా ఏర్పాటు చేశారు. రెండో సెట్టింగ్​లో లక్ష్మీదేవి సిరులు కురుపిస్తున్నట్టుగా.. మూడో సెట్టింగ్​లో హనుమంతుడు నృత్యం చేస్తున్నట్లుగా రూపొందించిన ప్రతిమలు అలరిస్తున్నాయి. మహబూబాబాద్​ జిల్లా కేసముద్రం మండలం అమీనాపురానికి చెందిన సూక్ష్మ కళాకారుడు నిఖిల్​ చాక్​పీస్​పై చెక్కిన వినాయకుడి ప్రతిమ అందరి మదిని దోచుకుంటోంది.

ఇవీ చూడండి..

నగరమంతా గణపతి శోభ.. ఆకట్టుకుంటున్న కార్తికేయ-2 మండపం

12వేల మంది పోలీసులు.. 22 క్రేన్లు.. గణేశ్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

చిరు 'గాడ్​ఫాదర్​'లో హీరోయిన్​ ఆమెనే.. పోస్టర్​తో క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.