ETV Bharat / state

హైదరాబాద్‌లో... వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగవంతం

author img

By

Published : Aug 31, 2021, 8:45 AM IST

కరోనా మూడవ దశ వస్తుందన్న డబ్య్లూహెచ్ఓ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన వైద్యఆరోగ్యశాఖ అధికారులు హైదరాబాద్​లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. కాలనీలు , బస్తీలలో వ్యాక్సినేషన్‌ సంచార వాహనాలను ఏర్పాటు చేసి ప్రజలకు వేగంగా వ్యాక్సిన్​ అందేలా చూస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 584 సంచార వాహనాలను వ్యాక్సినేషన్‌ కోసం ఉపయోగిస్తున్నారు.

In Hyderabad ... the vaccination process is fast.
హైదరాబాద్‌లో... వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగవంతం.

హైదరాబాద్‌ నగరంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం జీహెచ్‌ఎంసీ అధికారులు 448 కాలనీలు, బస్తీల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి చేశారు. 473 కాలనీల్లో వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తయినట్టు అధికారులు తెలిపారు.

కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా హైదరాబాద్​లో కొవిడ్ మొదటి, రెండవ డోస్ ప్రక్రియ వేగంగా జరుగుతుందని అధికారులు తెలిపారు. మొదటి డోస్‌ కింద 31240 మందికి రెండవ డోస్‌ 12397 మందికి ఇప్పటికి వరకు వ్యాక్సిన్‌ వేశారు. సోమవారం మొత్తం 43637 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయిందని ఒక ప్రకటన ద్వారా తెలిపారు. జీహెచ్‌ఎంసి పరిధిలో మొత్తం 584 సంచార వాహనాలను వ్యాక్సినేషన్‌ కోసం ఉపయోగించారు.

ఇదీ చదవండి:CM KCR: మూడురోజులు దిల్లీలోనే కేసీఆర్... రేపే పయనం.. అందుకేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.