ETV Bharat / state

US Consulate Office: నేడు నూతన భవనంలోకి అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం

author img

By

Published : Apr 20, 2023, 7:03 AM IST

US Consulate Relocated to Nanakramguda from Today: అత్యంత విశాలమైన భవనం.. పూర్తి పర్యావరణహితంగా రూపుదిద్దుకున్న సుందర కట్టడం. 12 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 2 వేల 800వేల కోట్ల వ్యయంతో హైదరాబాద్‌లో అమెరికన్‌ కాన్సులేట్‌ భవనాన్ని తీర్చిదిద్దారు. అధునాతన సాంకేతికతకు భారతీయ సంస్కృతిని జోడించి భవంతిని నిర్మించారు. వీసా సహా వివిధ దరఖాస్తులను ఒకేరోజు 3,500 పూర్తి చేసే సామర్థ్యంతో కొత్త కాన్సులేట్ సత్వర సేవలందించనుంది. 2023లో మిలియన్ అమెరికన్ వీసాలు జారీ చేసే లక్ష్యంతో పనిచేయనుంది.

US Consulate
US Consulate

నేటి నుంచి నూతన భవనంలోకి అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం

US Consulate Relocated to Nanakramguda from Today: హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో సువిశాల ప్రాంగణంలో అత్యంత ఆధునిక సౌకర్యాలతో నూతన అమెరికన్‌ కాన్సులేట్ భవనం రూపుదిద్దుకుంది. భవంతిలో మొత్తం 55 వీసా విండోస్‌ని అందుబాటులోకి తెచ్చారు. గతంలో వెయ్యి దరఖాస్తులు మాత్రమే పూర్తిచేసే వీలుండగా... ప్రస్తుతం కొత్త భవనం అందుబాటులోకి రావడం వల్ల ఆ సంఖ్య మూడురెట్లకు పెరగనుంది. కార్యాలయం చుట్టూ పచ్చదనం పరుచుకున్న నందనవనం, వర్షం నీరు ఒడిసి పట్టే సాంకేతికత, టెర్రస్ గార్డెన్, సౌర విద్యుత్ ఉత్పత్తి మరో ప్రత్యేకత. అమెరికన్ సాంకేతికతతో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా భవంతి లోపలి భాగాలను తీర్చిదిద్దారు.

నేటి నుంచి నూతన భవంతిలోకి యుఎస్‌ కాన్సులేట్ కార్యాలయం: బేగంపేట పైగా ప్యాలెస్‌లో కొనసాగుతున్న యుఎస్‌ కాన్సులేట్ కార్యాలయం నేటి నుంచి నానక్‌రామగూడలోని నూతన భవంతిలోకి మారనుంది. ఈ కార్యాలయం ద్వారా ఏపీ, తెలంగాణ సహా ఒడిశా రాష్ట్రాలకు యూఎస్ వీసాల జారీ చేయనుంది. అగ్రరాజ్యానికి వెళ్లే పర్యాటకులకు సేవలు అందించనున్నారు. నూతన కార్యాలయం మున్ముందు మరింత కీలకంగా మారనుందని హైదరాబాద్‌లో అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ వివరించారు.

'అమెరికాలో ఉన్నత విద్య చదివేందుకు చాలామంది విద్యార్థులు ఆసక్తిచూపుతారు. అలాంటి వారి కోసం సమగ్ర సమాచారాన్ని హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం అందిస్తుంది. అమెరికాలో ఉండే వ్యవస్థలు, ప్రభుత్వ విధానాలు, విశ్వవిద్యాలయాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తాం. భారత్‌లో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి అమెరికాలో చదివేందుకు ఎక్కువగా వస్తున్నారు. అలాంటి వారికోసం అమెరికాలో లభించే అవకాశాలు, ఉపాధి కల్పనపైనా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. భారత్‌ నుంచి చదివే వారికి అక్కడి వర్శిటీలు అందించే కోర్సులు, ఉపకారవేతనం తదితర విషయాలను వివరిస్తాం.'- జెన్నిఫర్ లార్సన్ , హైదరాబాద్‌లో అమెరికన్ కాన్సులేట్ జనరల్

యూఎస్ వచ్చే వారిలో అత్యధిక వాటా భారతీయులదే: ప్రపంచవ్యాప్తంగా యూఎస్ వచ్చే వారిలో అత్యధిక వాటా భారతీయులదేనని అమెరికన్ కాన్సులేట్ రెబెకా డ్రేమ్ అన్నారు. ఇక నుంచి పర్యాటక వీసాలు సైతం అత్యధికంగా అందిస్తామన్న రెబెకా... ఈ ఏడాది భారతీయులకు మిలియన్ వీసాలు జారీ చేసే లక్ష్యంతో అమెరికన్ కాన్సులేట్ పనిచేస్తుందన్నారు. విద్యార్థి వీసా సహా అన్ని రకాల వీసాలు అత్యధికంగా ఆర్నెళ్లలోపే జారీచేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

'చాలా ఏళ్ల నుంచి హైదరాబాద్‌ కాన్సులేట్‌ కార్యాలయంలో ఎక్కువ మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వాషింగ్టన్‌, దిల్లీ కంటే ఎక్కువ మంది ఇక్కడ సేవలు అందిస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి కాన్సులేట్‌ అధికారులు హైదరాబాద్‌ కార్యాలయంలో పనిచేస్తున్నారు. 2022 ఏడాదికి గాను 65 శాతం వాటాతో తాత్కాలిక పని కోసం అమెరికాలో అత్యధిక వీసాలు భారతీయులే పొందారు. ఎక్కువ మంది విద్యార్థులను పంపిస్తున్న దేశాల్లోనూ భారత్‌దే అగ్రస్థానం.'-రెబెకా డ్రేమ్, అమెరికన్ కాన్సులేట్

అమెరికన్ కాన్సులేట్ నూతన కార్యాలయం మూడు రాష్ట్రాల ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు సర్వాంగ సుందరంగా సిద్ధమైంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.