ETV Bharat / state

ఉరవకొండలో నువ్వా నేనా.. విశ్వేశ్వరరెడ్డి వర్సెస్ మధుసూదన్ రెడ్డి

author img

By

Published : Dec 11, 2022, 10:16 AM IST

Clashes between in YCP Leaders: ఏపీలోని ఉరవకొండ నియోజకవర్గంలో వైసీపీ నాయకుల మధ్య వర్గవిభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. విశ్వేశ్వరరెడ్డి, మధుసూదన్ రెడ్డిలు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదుటే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.

Clashes between in YCP Uravakonda
Clashes between in YCP Uravakonda

Clashes between in YCP Leaders: ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా ఉరవకొండ వైసీపీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఆయన సోదరుడు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్ రెడ్డి మధ్య ఉన్న ఆధిపత్య పోరు బయట పడింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదుటే మధుసూదన్ రెడ్డి విశ్వేశ్వరరెడ్డిపై విమర్శలు గుప్పించారు.

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి​ ఆదేశాలతో సరైన ఎమ్మెల్యే అభ్యర్థిని ఉరవకొండ నియోజకవర్గానికి నియమించాలని మధుసూదన్ రెడ్డి కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి మూడేళ్లు దాటినా, నియోజకవర్గంలో కార్యకర్తలు ఎలా ఉన్నారని.. ఇక్కడి నాయకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సమావేశాలను ఏర్పాటు చేసి.. కార్యకర్తలను పలకరిస్తున్నారన్నారని మధుసూదన్ రెడ్డి మండిపడ్డారు.

ఇవీ చదవండి: రేపు దిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్​.. కార్యాలయం ప్రారంభం

ఆహారంలో తల వెంట్రుక వచ్చిందని.. భార్యకు గుండు కొట్టించిన భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.