ETV Bharat / state

బాలలతో అసహజ లైంగిక క్రీడ...!

author img

By

Published : Feb 6, 2020, 2:10 PM IST

హైదరాబాద్​లో పాఠశాల చిన్నారులను లైంగికంగా వేధించే ముఠా ఉన్నట్లు కలకలం రేపుతోంది. ఇటీవల వాట్సప్​లో చెక్కర్లు కొడుతున్న 28 సెకన్ల వీడియో తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే ఈ అంశాన్ని రాచకొండ పోలీసులు గోప్యంగా ఉంచుతూ దర్యాప్తు చేస్తున్నారు.

unnatural sex incidents in hyderabad came through whatzup
బాలలతో అసహజ లైంగిక క్రీడ...!

పాఠశాలకు వెళ్లే బాలలతో అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠా లీలలు రాష్ట్ర రాజధానిలో బయటపడడం కలకలం రేపుతోంది. మాయమాటలతో చిన్నారులను మచ్చిక చేసుకుంటున్న కొందరు యువకులు... వారితో లైంగిక కోర్కెలు తీర్చుకుంటున్న ఉదంతం వెలుగు చూసింది. ముఠాలోని ఓ యువకుడు ఒక బాలుడితో అసహజరీతిలో లైంగిక వాంఛ తీర్చుకుంటున్న వీడియో బయటపడింది. 28 సెకన్ల నిడివిగల ఆ వీడియోలో యువకుడు తెలుగులో మాట్లాడుతుండడం... అదే ముఠాకు చెందినదిగా అనుమానిస్తున్న ఓ వాట్సప్‌ సంభాషణల్లో 'హయత్‌నగర్‌కు రా'... అనే సంక్షిప్త సందేశం ఉండటంతో రాజధానిలోనే ఈ దుశ్చర్య జరిగినట్లుగా భావించాల్సి వస్తోంది.

వాట్సప్ సంభాషణను బట్టి గతంలో ఈ ముఠా ఇదే రీతిలో పలువురు బాలలపై లైంగిక దాడులకు పాల్పడి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధిత బాలుడి గురించి ప్రస్తావిస్తున్న ముఠా సభ్యుడొకరు... మరో సభ్యుడిని హయత్‌నగర్‌కు రమ్మని చెబుతూ లొకేషన్‌ షేర్‌ చేసినట్టు తెలుస్తోంది. దుశ్చర్యకు సంబంధించి వీడియోలో యువకుడి మొహం సైతం కనిపిస్తోంది.

ఈ దురాగతంపై రాచకొండ పోలీసులకు ఫిర్యాదు అందగా... దర్యాప్తు చేపట్టారు. ముఠాలో ఎంత మంది ఉన్నారు, ఎంత మంది బాలలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు, బాలికలపైనా లైంగిక దాడులు చేశారా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారాన్ని రాచకొండ పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.

ఇవీ చూడండి: ఆస్తి కోసం 'అమ్మ,చెల్లెనూ'చంపేశాడు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.