ETV Bharat / state

Telangana Group 4 Exam : రేపే 'తెలంగాణ గ్రూప్​-4' పరీక్ష.. TSPSC సూచనలు ఇవే

author img

By

Published : Jun 30, 2023, 8:59 AM IST

Group 4 Exam Telangana : తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ నిర్వహించే గ్రూప్​-4 సర్వీసుల ఉద్యోగాల భర్తీకి జులై 1వ తేదీన (శనివారం) రాతపరీక్ష నిర్వహించేందుకు కమిషన్​ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 8వేల 180 పోస్టులకుగాను 9.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా.. రాష్ట్రవ్యాప్తంగా 2వేల 878 పరీక్ష కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో పరీక్ష విధానం ఎలా ఉండబోతుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై కమిషన్​ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Telangana Group 4 Exam
Telangana Group 4 Exam

Telangana Group 4 exam on July 1st : రాష్ట్రంలో 8 వేల180 గ్రూప్‌-4 సర్వీసుల ఉద్యోగాల భర్తీకి జులై 1వ తేదీన (శనివారం) రాతపరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మొత్తం 9.51 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్న నేపథ్యంలో అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2వేల 878 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. మొత్తం 40 వేల గదుల్లో అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ ముమ్మర ఏర్పాట్లను చేసింది. ఈ విషయమై ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, డీజీపీ, జిల్లా ఎస్పీలతో కమిషన్​ సమీక్షా సమావేశం నిర్వహించింది.

రెండు పేపర్లు.. : గ్రూప్​-4 పరీక్ష విధానంలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1 (జనరల్‌ స్టడీస్‌) ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటుంది. పేపర్‌-2 (సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌) మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ప్రతి పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తారు. అందువలన అభ్యర్థులు ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవడం మంచింది.

ఇవీ సూచనలు : అభ్యర్థులు ఓఎంఆర్‌ షీట్‌లో డబుల్‌ బబ్లింగ్‌ చేయకుండా టీఎస్పీఎస్సీ సూచనలను ఎస్ఎంఎస్ రూపంలో అభ్యర్థులకు చేరవేసింది. వాటితో పాటు బబ్లింగ్‌ లోపాలను వివరాలతో టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచింది. ఇది అభ్యర్థులు గమనించాలని సూచించింది. ప్రతి పరీక్షా కేంద్రంలో ప్రత్యేకంగా ఐడెంటిఫికేషన్‌ అధికారిని కమిషన్​ నియమించింది. ఆ అధికారి పర్యవేక్షణలో.. అభ్యర్థి పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించే ముందు హాల్‌టికెట్‌, అందులోని పేరు, ఫొటో గుర్తింపు కార్డు, మిగతా వివరాలను పరిశీలించి అనుమతించనున్నారు.

పోలీసులు అభ్యర్థుల్ని తనిఖీ చేసిన అనంతరం పరీక్ష గదుల్లోకి పంపిస్తారు. తనిఖీ సమయంలో అభ్యర్థులు పోలీసులకు సహకరించాలని పబ్లిక్​ సర్వీస్​ సూచించింది. అభ్యర్థులు తీసుకువచ్చిన ఫొటో గుర్తింపు కార్డు, హాల్‌టికెట్‌లలోని సంతకాలు.. నామినల్‌రోల్‌లో పెట్టే సంతకంతో సరిపోలాలని పేర్కొంది. ఈ మేరకు ప్రత్యేక శిక్షణ పొందిన ఇన్విజిలేటర్లు.. హాల్‌టికెట్‌, గుర్తింపు కార్డుల్లోని ఫొటో, నామినల్‌ రోల్‌.. పరిశీలించి అభ్యర్థి గుర్తింపును ధ్రువీకరిస్తారు.

పరీక్షా కేంద్రాలైన విద్యాసంస్థలకు 1న సెలవు : జులై 1వ తేదీన‘గ్రూప్‌-4’ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ఆ రోజు పరీక్షా కేంద్రాలున్న పాఠశాల​లు, కాలేజీలకు సెలవు ప్రకటించాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పరీక్ష నిర్వహించే 2వేల 878 కేంద్రాలకు సంబంధించిన విద్యాసంస్థలకు మాత్రమే శనివారం సెలవు ఉంటుంది. అదే రోజు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో సప్లిమెంటరీ పరీక్షలున్నందున వాటిని వాయిదా వేస్తున్నామని పేర్కొన్నారు. ఆ రోజు జరగాల్సిన పరీక్షను జులై 15వ తేదీన నిర్వహిస్తామని రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి ఎ.పుల్లయ్య ఒక ప్రకటనలో వెల్లడించారు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.