ETV Bharat / state

TS HC on Group1 Prelims Exam : 'నా బిడ్డ గ్రూప్1 పరీక్ష రాస్తోంది.. ఈ పిటిషన్​ను నేను విచారించలేను'

TS High Court on Group 1 Prelims Exam : టీఎస్‌పీఎస్సీ జూన్‌ 11న నిర్వహించనున్న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలను వాయిదా వేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్​పై విచారణ ప్రారంభమైంది. వేసవి సెలవుల నేపథ్యంలో వెకేషన్​ కోర్టులో ఇవాళ ఈ పిటిషన్​పై విచారణ జరిపిన జస్టిస్ కె. లక్ష్మణ్.. మధ్యాహ్నం మరో బెంచ్​కు పంపిస్తానని పేర్కొన్నారు.

author img

By

Published : May 25, 2023, 8:23 AM IST

Updated : May 25, 2023, 2:20 PM IST

TS High Court
TS High Court

TS High Court on Group 1 Prelims Exam : జూన్ 11న జరగాల్సిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టులో విచారణ మొదలైంది. ఈ పిటిషన్​పై విచారణ ప్రారంభించిన జస్టిస్ కె.లక్ష్మణ్ మధ్యాహ్నం మరో బెంచ్​కు పంపిస్తానని వెల్లడించారు. తన కుమార్తె కూడా గ్రూప్ర-1 పరీక్ష రాస్తున్నందున ఈ పిటిషన్​ను విచారించలేనని తెలిపారు.

గతేడాది అక్టోబరులో గ్రూప్-1 ప్రిలిమ్స్​ను టీఎస్​పీఎస్సీ నిర్వహించింది. అయితే మార్చి నెలలో కమిషన్‌లోని ఉద్యోగుల వల్ల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి రావడంతో.. గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేసిన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్... ఆ పరీక్షను జూన్ 11న నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

ఆ నిబంధనకు విరుద్ధంగా గ్రూప్​-1 ప్రిలిమ్స్ పరీక్ష​ : ఈ నేపథ్యంలో ఈ పరీక్షలను కనీసం 2 నెలలు వాయిదా వేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లాకు చెందిన బి.వెంకటేశ్‌తోపాటు హైదరాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌, మహబూబాబాద్‌, వికారాబాద్‌, నల్గొండ, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, జనగామ, కొత్తగూడెం, మంచిర్యాల, ఖమ్మం, గద్వాల జిల్లాలకు చెందిన 36 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. సాధారణంగా టీఎస్​పీఎస్సీ చట్టం ప్రకారం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షల మధ్య మధ్య తగినంత విరామం ఉండేలా నిర్వహించాల్సి ఉందని.. ఈ మేరకు ఈ నెల 11న టీఎస్‌పీఎస్సీకి ఇచ్చిన వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకుని తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఆ నిబంధనకు విరుద్ధంగా టీఎస్​పీఎస్సీ వ్యవహరిస్తోందని పిటిషనర్లు వాదిస్తున్నారు.

పరీక్షను వాయిదా వేసేలా ఆదేశాలు ఇవ్వాలి : టీఎస్​పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శికి వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ స్పందించడం లేదని పిటిషన్​లో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి వాస్తవాలు వెలికి తీయాలని సిట్‌కు కూడా వినతిపత్రం సమర్పించినట్లు పిటిషనర్లు తెలిపారు. అయితే వీటిని పట్టించుకోకుండా ప్రిలిమ్స్‌ను జూన్‌ 11న నిర్వహించాలని తేదీ ప్రకటించారన్నారు. పరీక్షను వాయిదా వేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహణపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, టీఎస్​పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శి, సిట్​ను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై ఉదయం విచారణ చేట్టిన జస్టిస్ కె.లక్ష్మణ్​ తాను ఈ పిటిషన్​ను విచారించలేనని.. మధ్యాహ్నం మరో బెంచ్​కి పంపిస్తానని తెలిపారు. మరోవైపు టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతూనే ఉంది.

ఇవీ చదవండి :

Last Updated : May 25, 2023, 2:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.