ETV Bharat / state

ధరణి పోర్టల్​పై తహసీల్దార్​లకు శిక్షణ

author img

By

Published : Oct 27, 2020, 12:35 AM IST

ఈనెల 29న ధరణి పోర్టల్​ ప్రారంభం నేపథ్యంలో తహసీల్దార్లకు ఇవాళ శిక్షణ ఇవ్వనున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్​కేసర్​లోని అనురాగ్ విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మార్వోలు హాజరుకానున్నారు.

Training for mro's in the wake of the launch of the Dharani portal
ధరణి పోర్టల్​పై తహసీల్దార్​లకు రేపు శిక్షణ

ధరణి పోర్టల్ ప్రారంభం నేపథ్యంలో తహసీల్దార్లకు నేడు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 29న ధరణి పోర్టల్​ను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ధరణిని సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ధరణి ద్వారా రిజిస్ట్రేషన్లు, లావాదేవీలకు సంబంధించి తహసీల్దార్లకు ఇప్పటికే ఆన్​లైన్ శిక్షణ పూర్తైంది. దాని ఆధారంగా తహసీల్దార్లు ప్రయోగాత్మకంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రత్యేకించి సర్వర్ సామర్థ్యం సరిపోవడం లేదని ఆరోపిస్తున్నారు. వీటన్నింటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్లకు మంగళవారం నాడు శిక్షణ ఏర్పాటు చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్​కేసర్​లోని అనురాగ్ విశ్వ విద్యాలయంలో తహసీల్దార్లకు తర్ఫీదు ఇవ్వనున్నారు.

ఇదీ చూడండి.. ప్రత్యేక విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువు పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.