ETV Bharat / state

బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో నేడు వర్షాలు పడే అవకాశం..

author img

By

Published : Oct 19, 2022, 4:22 PM IST

weather
వాతావరణం

Today weather report in telangana: రాష్ట్రంలో తూర్పు బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Today weather report in telangana: రాగల 24 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 22వ తేదీన ఉదయానికి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుంది. ఆ తర్వాత క్రమంగా ఇది బలపడుతూ 48గంటల్లో మరింత బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు వివరించారు.

రాష్ట్రంలో ఈ రోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందన్నారు. రేపు, ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ పడుతాయని ఐఎండీ సంచాలకులు సూచించారు. కావున ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున అందరూ రక్షిత ప్రదేశాల్లో ఉండాలని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.