ETV Bharat / state

శ్రీవారి భక్తులకు గుడ్​ న్యూస్​.. శీఘ్ర దర్శన టికెట్లు విడుదల చేసిన ఆర్టీసీ

author img

By

Published : Feb 7, 2023, 10:38 PM IST

TTD tickets available in TSRTC: తిరుపతి వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలంటే కొన్ని గంటలు పాటు వేచి ఉండాల్సి వస్తుంది. ఒక్కోసారి దర్శన టికెట్​ కోసమే చాలా సమయం భక్తులు వేచి ఉంటారు. అలా భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు టీఎస్​ఆర్టీసీ దర్శన టికెట్​ బస్సులోనే పొందే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా శీఘ్ర దర్శన టికెట్లను విడుదల చేసినట్లు సంస్థ ప్రకటించింది.

TSRTC Tirumala quick darshan tickets released
టీఎస్​ఆర్టీసీ తిరుమల శీఘ్ర దర్శన టికెట్లు విడుదల

TTD tickets available in TSRTC: తిరుమల్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోడానికి తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో భక్తులు వెళ్లడం వలన టీఎస్ఆర్టీసీ కొన్ని నెలలు క్రితం బస్సులోనే టికెట్లు బుక్​ చేసుకొనే సదుపాయాన్ని తీసుకు వచ్చింది. బాలాజీ దర్శన్‌ టికెట్లకు భక్తుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఏడు నెలల్లో 77,200 మంది భక్తులు బాలాజీ దర్శన్‌ టికెట్లను బుక్‌ చేసుకుని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తెలంగాణ నుంచి తిరుమల వెళ్లే భక్తుల కోసం గత ఏడాది జులై నుంచి బాలాజీ దర్శన్‌ ను టీఎస్​ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. తిరుమల వెళ్లేందుకు బస్‌ టికెట్‌ బుక్‌ చేసుకునే సమయంలోనే శ్రీవారి శీఘ్ర దర్శన టికెట్‌ను బుక్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. అందుకోసం టీటీడీతో టీఎస్‌ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది.

టీఎస్​ఆర్టీసీ ప్రవేశపెట్టిన ఈ టికెట్లకు అద్బుతమైన స్పందన వస్తుంది. గత ఏడాది జూలైలో 3,109, ఆగస్టులో 12,092, సెప్టెంబర్‌లో 11,586, అక్టోబర్‌లో 14,737, నవంబర్‌లో 14,602, డిసెంబర్‌లో 6,890, ఈ ఏడాది జనవరిలో 14,182 మంది బస్‌ టికెట్‌తో పాటు శ్రీవారి శీఘ్ర దర్శన టికెట్లను బుక్‌ చేసుకున్నట్లు ఆర్టీసీ తెలిపింది.

గతంలో శ్రీవారి శీఘ్ర దర్శన టికెట్లను భక్తులు బుక్​ చేసుకున్న వివరాలు:

నెలటికెట్లు బుక్​ చేసుకున్న వారి సంఖ్య
జులై(2022)3,109
ఆగస్టు(2022)12,092
సెప్టెంబర్‌(2022)11,586
అక్టోబర్‌(2022)14,737
నవంబర్‌(2022)14,602
డిసెంబర్‌(2022)6,890
జనవరి(2023)14,182

ఈ నెలలో శుభకార్యాలు, పెళ్లిళ్లు ఎక్కువగా ఉన్నాయి. శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులు టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని యాజమాన్యం కోరుతోంది. ప్రయాణ టికెట్‌తో పాటు శ్రీవారి ప్రత్యేక‌ దర్శన టికెట్‌ను సంస్థ అందిస్తోంది. ఈ టికెట్​తో ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా ప్రయాణించి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవచ్చు అని తెలిపింది. బాలాలయ మహా సంప్రోక్షణను టీటీడీ వాయిదా వేసినందున ఈ నెల 23 నుంచి మార్చి 1 వరకు బ్లాక్ చేసి ఉన్న శీఘ్ర దర్శన టికెట్లను తిరిగి విడుదల చేయడం జరిగిందని ఆర్టీసీ తెలిపింది.

భక్తులు www.tsrtconline.in వెబ్‌ సైట్​లో టికెట్లను బుక్‌ చేసుకోవచ్చని ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనార్​లు సూచించారు. బాలాజీ దర్శన్ టికెట్లను కనీసం వారం రోజుల ముందుగా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంద‌న్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.