Tips to Beat Menopause Belly in Telugu : ఒక వయసుకు వచ్చాం అంటే హార్మోన్ల ప్రభావం కారణంగా శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా మెనోపాజ్ దశలో పొట్ట పెరగడానికి హార్మోన్లే ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. ఈ దశలో ఈస్ట్రోజెన్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి కావడం వల్ల వాటి స్థాయుల్లో సమతుల్యత లోపిస్తుందని చెబుతున్నారు. ఇది పొట్ట చుట్టూ, పొత్తి కడుపు దగ్గర పేరుకుపోవడానికి ప్రేరేపిస్తుందని.. కొంతమంది శరీర బరువు పెరగకపోయినా ఇలా పొట్ట పెరగటం వల్ల ఇబ్బందికి గురవుతుంటారని అంటున్నారు. అయితే దీన్ని నిర్లక్ష్యం చేస్తే... రాను రాను బరువు పెరిగి శ్వాస సంబంధిత సమస్యలు, గుండె సమస్యలు, టైప్-2 మధుమేహం.. వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అందుకే ముందు జాగ్రత్తతో కొన్ని ఆహార పదార్థాలను మెనూలో చేర్చుకోవడం వల్ల ఫలితం ఉంటుందంటున్నారు.
- అవిసె గింజలు ఇలా కూడా పనిచేస్తుంది: అవిసె గింజలు ఆరోగ్యానికే కాదు.. శరీర అధిక బరువు తగ్గించడానికి దోహదపడతాయి. వీటిలో ఉండే మోనోఅన్‌శ్యాచురేటెడ్ కొవ్వులే దీనికి కారణం. ఇవి శరీరంలోకి అధిక నీరు చేరకుండా చేయడంతో పాటు ఈస్ట్రోజెన్ స్థాయుల్నీ క్రమబద్ధీకరించడానికి ఉపయోగపడతాయి.
- మన శరీరంలో విడుదలయ్యే కార్టిసాల్ హార్మోన్ ఒత్తిడికి కారణమవుతుంది. ఇదీ పొట్టభాగంలో కొవ్వు పేరుకుపోయేందుకు కారణమవుతుంది. కాబట్టి ఈ హార్మోన్ స్థాయుల్ని తగ్గించడంలో దాల్చిన చెక్క చాలా ఉపయోగపడుతుంది.
- సబ్జ వల్ల ఇంత లాభం : సబ్జ గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పేగు కదలికల్ని ప్రేరేపించి రకరకాల జీర్ణ సంబంధిత సమస్యల్ని దూరం చేస్తుంది. అంతేకాకుండా.. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పొట్టు చుట్టూ పెరిగిన కొవ్వు కరిగిస్తుందని పలు అధ్యయనాలు కూడా రుజువు చేశాయి.
- సులభంగా పొట్ట తగ్గించవచ్చు : యాపిల్ సైడర్ వెనిగర్ చెడు కొవ్వుల్ని కరిగించడంలో సమర్థంగా పని చేస్తుంది. పైగా ఇందులో క్యాలరీలు తక్కవుగా ఉంటాయి. కాబట్టి పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి ఇది సులభమైనా ప్రత్యామ్నాయం అంటున్నారు నిపుణులు. గ్లాసు నీటినో టేబుల్‌స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసుకొని పరిగడుపున తాగడం వల్ల ఫలితం ఉంటుంది.
- పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వుల్ని కరిగించడానికి పప్పులు, కాయధాన్యాల్లోని ఫోలికామ్లం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి, ఫైబర్, ప్రొటిన్ వంటి పోషకాలున్న ఆహారం తీసుకోవాలి.
- మానసిక ఒత్తిడికి ఇవి మేలు : ఆకుకూరల్లో లభించే మెగ్నీషియం ఎందులోనూ రాదు. ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీ... వంటి మానసిన సమస్యలను తగ్గించడంలో దోహదపడుతుంది. పరోక్షంగా ఇవి శరీరంలో పేరుకున్న చెడు కొవ్వులు, పొట్టను తగ్గిస్తుంది అన్నమాట..!
- ఈ దశలో ఇవే మేలు : మెనోపాజ్ దశలో తలెత్తే దుష్ప్రభావాలే మహిళల్లో అనేక మానసిక సమస్యలకు కారణమవుతాయి. వీటిని దూరం చేయాలంటే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే చేపలు, సీ-ఫుడ్, వాల్‌నట్స్‌ను మన డైట్లో చేర్చుకుంటే మంచిదని చెబుతోంది ఓ అధ్యయనం.
ఇలాంటి ఆహారం తీసుకుంటూనే బరువులెత్తం, నడక, పరుగు, ఈత, సైక్లింగ్.. వంటి వ్యాయామాలు చేయడం వల్ల నలభై దాటాక వచ్చే పొట్టను తగ్గించడంలో సహకరిస్తాయంటున్నారు నిపుణులు. అయితే ఈ నియమాలు పాటిస్తున్నా ఫలితం లేకపోతే. ఇంకా ఏమైనా సమస్యలు ఎదురైతే... ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.
ఇవీ చదవండి: