ETV Bharat / state

ఐఎస్​డీ కాల్స్​ను లోకల్ కాల్స్​గా మార్చుతున్న కేంద్రంపై దాడి

author img

By

Published : Nov 21, 2019, 12:36 PM IST

అంతర్జాతీయ కాల్స్​ను లోకల్ కాల్స్​గా మార్చుతున్న కేంద్రంపై టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడి చేసి నలుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్​ పాతబస్తీ పరిధిలో చోటుచేసుకుంది.

ఐఎస్​డీ కాల్స్​ను లోకల్ కాల్స్​గా మార్చుతున్న కేంద్రంపై దాడి

అంతర్జాతీయ కాల్స్​ను లోకల్​ కాల్స్​గా మార్చుతున్న కేంద్రంపై టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడి చేశారు. ఈ వ్యవహారంలో నలుగురు నిందితులను అరెస్టు చేసి.. వారి నుంచి 300 సిమ్​కార్డులు, 20 సిమ్​ బాక్సులు, వైఫై రుటర్లు, యూపీఎస్​ తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఏం జరిగిందంటే?

హైదరాబాద్​ పాతబస్తీ పరిధిలోని ఇస్మాయిల్​ నగర్​లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఇమ్రాన్​ అతని భార్య రేష్మ సుల్తానా ఈ కేంద్రాన్ని నడిపిస్తున్నారు. వీరికి అవసరమైన సిమ్​కార్డులు కామారెడ్డి జిల్లా పల్కమ్​ పేటలోని కిరాణ దుకాణం నిర్వాహకులు వాహిద్​, అహ్మద్​ సరఫరా చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్ భార్య రేష్మ సుల్తానా, వాహిద్, అహ్మద్, సిమ్‌కార్డు పంపిణీ దారుడు అబ్దుల్ నవీద్​లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు ఇమ్రాన్ కోసం గాలిస్తున్నారు.

ఐఎస్​డీ కాల్స్​ను లోకల్ కాల్స్​గా మార్చుతున్న కేంద్రంపై దాడి

ఇవీ చూడండి: సీఎం గారూ ఆర్టీసీ కార్మికులను చేర్చుకోండి: పవన్​ కల్యాణ్

Tg_hyd_17_21_task_force_raid_av_ts10003. feed from whatsapp desk. అంతర్జాతీయ కాల్స్ ను లోకల్ కాల్స్ గా మార్చుతున్న కేంద్రం పై చాంద్రాయణగుట్ట, దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ పోలీస్ లు కలిసి దాడి చేసిన ఘటన హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట ps పరిధిలోని ఇస్మాయిల్ నగర్ లో చోటు చేసుకుంది ఈ వ్యవహారంలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 300 సింకార్డులు, 20 సిం బాక్స్ లు, వైఫై రుటర్లు,ups తదితర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడి ఇమ్రాన్ ఖాన్ భార్య రేష్మ సుల్తానా, వాహిద్, అహ్మద్ , సిం కార్డ్ పంపిణీ దారుడు అబ్దుల్ నవీద్ ఉన్నారు. బండ్లగూడ ఇస్మాయిల్ నగర్ లో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని పరారికి ఉన్న ఇమ్రాన్ అతని భార్య ఇంట్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని నడిపిస్తున్నారు, వీరికి అవసరమైన సిం కార్డులు కామ రెడ్డి జిల్లా పల్కమ్ పేట లోని ఓ కిరణ దుకాణం నిర్వాహకులు వాహిద్, అహ్మద్ ద్వారా నుంచి పెద్ద ఎత్తున సరఫరా అయినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితుడు ఇమ్రాన్ పట్టుబడ్డ తర్వాత మరింత సమాచారం రానుంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.