ETV Bharat / state

'డబ్బులిస్తే చాలు ఏ సర్టిఫికెట్ అయినా ఇచ్చేస్తారు..'

author img

By

Published : Feb 28, 2023, 5:41 PM IST

Updated : Feb 28, 2023, 7:07 PM IST

Gang making fake certificates arrested
నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్

Gang making fake certificates arrested in HYD: విద్యార్థుల జీవితాలను మార్చేవి విద్యార్హత సర్టిఫికేట్లే. వాటి కోసమే వారి సగం జీవితం అయిపోతుంది. ఈ సర్టిఫికేట్లు ఆధారంగానే వారి జీవితం ఆధారపడి ఉంటుంది. కొంత మంది వ్యక్తులు ఈ సర్టిఫికేట్లులను నకిలీవి తయారు చేస్తున్నారు. అలాంటి వారిని హైదరాబాద్​లోని పోలీసులు పట్టుకున్నారు.

Gang making fake certificates arrested in HYD: నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను చాదర్​ఘాట్​ పోలీసులు, హైదరాబాద్​ దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి వివిధ రకాల విశ్వవిద్యాలయాలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొహమ్మద్ హాబీబ్, అబ్దుల్ రౌఫ్, మొహమ్మద్ ఇర్ఫాన్, షానవాజ్ ఖాన్, జూబైర్, సల్మాన్ ఖాన్, అబ్దుల్ సత్తార్, సునీల్ కపూర్ 8 మంది ముఠాగా ఏర్పడి ఫేక్​ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నారు.

ఉన్నత విద్య కొరకు విదేశాలకు వెళ్లే వారి వద్ద నుంచి భారీగా డబ్బులు తీసుకొని నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చేవారు. ముహమ్మద్ హాబీబ్ దిల్లీకు చెందిన సునీల్ కపూర్​తో కలిసి ఈ సర్టిఫికెట్లు తయారు చేయిస్తున్నాడు. విదేశాలకు పంపే కన్సల్టెన్సీ యజమాని, వర్కర్​లను మధ్యవర్తిగా పెట్టి తన దందా కొనసాగిస్తున్నాడు.

వీరిని హైదరాబాద్​లో చాదర్​ఘాట్​ పోలీసులు, టాస్క్​ఫోర్స్ పోలీసులు కలసి పట్టుకున్నారు. వారు తయారు చేసిన నకిలీ సర్టిఫికెట్లలో తెలంగాణ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ, రాజస్థాన్ నర్సింగ్ కౌన్సిల్, బెంగళూర్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీ తమిళనాడు, రాజస్థాన్ యూనివర్సిటీ ఫర్ హెల్త్ సైన్స్, తదితర యూనివర్సిటీ, కాలేజ్​ల పేరుతో తయారు చేసిన నకిలీ సర్టిఫికెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వీటితో పాటు నిందితుల దగ్గర నుంచి 4 ల్యాప్​ టాప్​లు, 11సెల్​ఫోన్లు, రూ. 20వేల నగదు తీసుకున్నారు. ఈ ముఠాకు చెందిన 8 మందిలో ఏడుగురు పోలీసులకు చిక్కారు. ప్రధాన నిందితుడైన సునీల్ కపూర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ ముఠాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరిని పట్టుకున్నందుకు పోలీసులను డీసీపీ అభినందించారు.

"దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 17 కాలేజీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను ఈ ముఠా తయారు చేస్తోంది. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. ఏడుగురిని అరెస్ట్ చేశాం. వీరి దగ్గర నుంచి 70 మంది వ్యక్తులు సర్టిఫికెట్లు తీసుకున్నట్లు తెలుస్తుంది. అందులో 30 మంది విదేశాలకు వెళ్లిపోయారు. మిగిలిన వారు మన దేశంలోనే ఉన్నారు."- చక్రవర్తి , టాస్క్​ఫోర్స్ డీసీపీ

ఇవీ చదవండి:

Last Updated :Feb 28, 2023, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.