ETV Bharat / state

Sirpurkar Commission: జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ విచారణకు విరామం.. ఎందుకంటే!

author img

By

Published : Oct 30, 2021, 7:06 PM IST

దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిర్పూర్కర్ కమిషన్​ (Sirpurkar Commission) విచారణ వాయిదా పడింది. నేటి నుంచి ఈనెల 7 వరకు దీపావళి సందర్భంగా సెలవులు ప్రకటించింది.

Sirpurkar Commission
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్

జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ విచారణ ఈనెల 8కి వాయిదా పడింది. శుక్రవారం వరకు పలువురు సాక్ష్యులను సిర్పూర్కర్ కమిషన్ (Sirpurkar Commission)విచారించింది. నేటి నుంచి ఈనెల 7 వరకు దీపావళి సందర్భంగా సెలవులు ప్రకటించింది. 8న విచారణ పునః ప్రారంభం కానుంది. దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై 2019 డిసెంబర్ 12న సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిషన్(Sirpurkar Commission)​ను ఏర్పాటు చేసింది. ఎన్​కౌంటర్​పై విచారణ జరిపి ఆర్నెళ్లలో నివేదిక ఇవ్వాల్సి ఉన్నప్పటికీ... కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు సిర్పూర్కర్ కమిషన్(Sirpurkar Commission).. సుప్రీంకోర్టుకు నివేదికను సమర్పించే అవకాశం ఉంది. ఈ మేరకు కమిషన్ విచారణను వేగంగా కొనసాగిస్తోంది.

హోంశాఖ కార్యదర్శి రవిగుప్తతో ప్రారంభమైన విచారణ... సిట్ ఛైర్మన్ మహేశ్ భగవత్, దర్యాప్తు అధికారి సురేందర్ రెడ్డి, అప్పటి సైబరాబాద్ సీపీ సజ్జనార్, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి, మృతుల కుటుంబ సభ్యులు, ఎన్​హెచ్​ఆర్సీ సభ్యులు, అఫిడవిట్ దాఖలు చేసిన మానవ హక్కుల సంఘాలతో పాటు ఎన్​కౌంటర్​లో పాల్గొన్న పోలీస్ అధికారులు, పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులను కూడా కమిషన్ (Sirpurkar Commission)విచారించింది. దిశ హత్యాచారం మొదలుకొని, ఎన్​కౌంటర్, పోస్టుమార్టం వరకు పలు అంశాలపై సిర్పూర్కర్ కమిషన్ (Sirpurkar Commission) సాక్ష్యులను ప్రశ్నించింది. 8న మరోసారి ప్రారంభమయ్యే విచారణలో కమిషన్ సభ్యులు మరికొంత మంది పోలీస్ అధికారులను ప్రశ్నించనుంది.

ఇదీ చూడండి: SIRPURKAR COMMISSION:సిర్పూర్కర్​ కమిషన్ ప్రశ్నల వర్షం..హైకోర్టును ఆశ్రయించిన ఏసీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.