ETV Bharat / state

బీ అలెర్ట్: మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

author img

By

Published : Jul 9, 2020, 4:16 PM IST

రాష్ట్రంలో రాగల మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్​ వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఒడిశా ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనమే కారణమని అధికారులు వెల్లడించారు.

telangana-weather-update-news
బీ అలెర్ట్: మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

రాష్ట్రంలో రాగల మూడురోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

దక్షిణ ఒడిశా... దాని పరిసర ప్రాంతాల్లో 3.1కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం సంచాలకులు వివరించారు.

ఇవీ చూడండి: పరిస్థితి బాలేదు.. కరోనా పరీక్షలు పెంచండి: అసదుద్దీన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.