ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @11AM

author img

By

Published : Dec 26, 2022, 10:55 AM IST

Telangana Top News today
Telangana Top News today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • రైళ్లలో చోటేది స్వామీ!

శబరిమల వెళ్లేందుకు రైల్లో రిజర్వేషన్​లు దొరకకా అయ్యప్ప భక్తులు ఆందోళన చెందుతున్నారు. అరకొర సంఖ్యలో ప్రత్యేక రైళ్లు ఉండటంతో.. భారీగా వెయిటింగ్‌ లిస్ట్ కనిపిస్తోంది. దీంతో చాలా మంది బస్సులు, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.

  • గిరిజన హాస్టల్‌ వార్డెన్‌ పోస్టుల విద్యార్హతల్లో మార్పులు..

గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో వార్డెన్​ పోస్టులకు నోటిఫికేషన్​తో టీఎస్​పీఎస్సీ ఇటీవల ఓ శుభవార్త చెప్పింది. దీంతో చాలా మంది ఎగిరిగంతేశారు. అయితే వారి సంతోషం ఎన్నో రోజులు నిలువలేదు. నోటిఫికేషన్​కు సంబంధించి అర్హత విషయంలో మార్పు చేయడంతో అభ్యర్థుల్లో గందరగోళం ఏర్పడింది.

  • గ్రామ పంచాయతీలూ.. 15వ ఆర్థిక సంఘం నిధుల్నే ముందు వాడుకోండి

రాష్ట్రంలోని పంచాయతీలన్నీ 15వ ఆర్థిక సంఘం నిధులనే ముందుగా వాడుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ నిధులు నూరు శాతం ఖర్చయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపింది. ఈ మేరకు జిల్లా అధికారులకు పంచాయతీరాజ్‌ శాఖ వాట్సప్‌ ద్వారా సమాచారాన్ని పంపింది.

  • అది నీరు కాదు.. విషం..

పెరిగిపోతున్న జనాభా, పారిశ్రామిక వాడలతో నదీ జలాలను కాలుష్యం ముంచెత్తుతోంది. నీటి వనరుల నాణ్యతపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఇటీవల రాష్ట్ర పర్యావరణశాఖకు నివేదిక ఇచ్చింది. మూసీ నదితో పాటు సగానికిపైగా చెరువుల్లో కాలుష్యం తీవ్రంగా ఉన్నట్లు గుర్తించింది.

  • పారేసుకున్న పర్సు.. యువతి ప్రాణాలను కాపాడింది..

ఓ యువతి తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే కారణంతో.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఓ ఆర్టీసీ బస్సు ఎక్కింది. అనంతరం ఓ స్టాప్​ దగ్గర దిగి వెళ్లిపోయింది. కానీ తనతో తెచ్చుకున్న పర్సు మాత్రం ఆ బస్సులోనే పడిపోయింది. ఇప్పుడు ఆ పర్సు.. ఆ యువతి ప్రాణాలను రక్షించింది. ఎలాగంటారా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

  • మహాత్మా గాంధీ సహా మాజీ ప్రధానులకు రాహుల్​ గాంధీ నివాళి

భారత్ జోడో యాత్రకు రాహుల్ గాంధీ స్వల్ప విరామం తీసుకున్నారు. దిల్లీ చేరుకున్న ఆయన సోమవారం ఉదయం మహాత్మా గాంధీ సహా పలువురు మాజీ ప్రధానులకు నివాళులు అర్పించారు. జనవరి 3న తిరిగి భారత్ జోడో యాత్ర ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.

  • సరిహద్దులో పాక్​ డ్రోన్ కూల్చివేత..

పాకిస్థాన్​కు చెందిన డ్రోన్​.. భారత్​ గగనతలంలోకి ప్రవేశించడం కలకలం రేపింది. పంజాబ్ అమృత్​సర్​ జిల్లాలో చక్కర్లు కొడుతున్న పాక్​ డ్రోన్​పై బీఎస్​ఎఫ్​ కూల్చివేసింది. అనంతరం ఆ డ్రోన్​ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

  • ఆ దేశాల్లో 'చిల్లీ' సాస్​కు ఫుల్​ డిమాండ్​.. కొవిడ్​ రోగులకు మంచి ఫుడ్​ అదే!

అధిక ఉష్ణోగ్రతలు, కరవు కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో హాట్‌ చిల్లీసాస్‌కు కొరత ఏర్పడింది. దీంతో కీలకమైన ఈ ఆహార పదార్థాన్ని నిల్వ చేసుకోవడానికి ఎగబడ్డారు. ఎంత ఘాటుగా ఉన్నప్పటికీ ఆహారంలో మిర్చి తగలనిదే కొందరికి అనుభూతి ఉండదు.

  • 'మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌' పుజారాకు ఎందుకిచ్చారబ్బా..

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల మ్యాచ్​లో 'మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌'గా పుజారాను ఎంపిక చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు..

  • అబ్బో అల్లు అరవింద్​-సుక్కులో ఈ యాంగిల్​ కూడా ఉందా..

ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్​, దర్శకుడు సుకుమార్​ ఓ యంగ్​ బ్యూటీ హీరోయిన్​తో కలిసి చిందులేస్తూ రచ్చ చేశారు. దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మీరూ చూసేయండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.