ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @3PM

author img

By

Published : Oct 30, 2022, 3:04 PM IST

Telangana Top News today
Telangana Top News today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • మరికొద్దిసేపట్లో బంగారిగడ్డ చేరుకోనున్న సీఎం కేసీఆర్

మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి కాసేపట్లో మునుగోడు నియోజకవర్గంలోని బంగారిగడ్డ సీఎం కేసీఆర్​ చేరుకోనున్నారు. గత రెండు రోజులుగా రాష్ట్రంతో పాటు దేశాన్ని కూడా కుదుపేస్తున్న ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించి కేసీఆర్​ ఇంత వరకు నోరువిప్పలేదు. ఇప్పుడు తాజా ప్రచారం నేపథ్యంలో కేసీఆర్​ ఈ అంశంపై ఏం మాట్లడుతారు అనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

  • సీబీఐ దర్యాప్తునకు అనుమతి లేదు.. 2 నెలల క్రితమే ఉపసంహరించిన ప్రభుత్వం

రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తు అనుమతి లేకుండా రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు చేసే అవకాశం లేకుండా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • రిసార్టులో డేంజర్ గేమ్, సాప్ట్​వేర్ ఇంజినీర్ దుర్మరణం

వికారాబాద్​ చుట్టూ రిసార్ట్స్ పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఈ రిసార్టుల్లో నిర్వహించే డేంజర్ గేమ్స్ యువకుల పాలిట శాపంగా మారాయి. తాజాగా నిన్న రాత్రి ఓ రిసార్టులో ఈ డేంజర్​ గేమ్​ వల్ల​ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గోధుమగూడలోని రిసార్ట్​లో అడ్వంచర్ క్లబ్ ఆధ్వర్యంలో మూన్ లైట్ కార్యక్రమం నిర్వహించారు.

  • ఐదో రోజు ఉత్సాహంగా రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర..

మహబూబ్‌నగర్‌ జిల్లాలో రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర ఐదో రోజు కొనసాగుతోంది. రహదారి పొడవున ప్రజలు రాహుల్‌కు నీరాజనం పడుతున్నారు. ఈ పాదయాత్రలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.

  • 'యోగా వల్ల శరీరం, బుద్ధి, మనసు అధీనంలో ఉంటాయి'

దైనందిన జీవితంలో ధ్యానం, యోగా అలవరుచుకోవడం వల్ల మంచి ఫలితాలు సిద్ధిస్తాయని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్​సింగ్ చౌహన్ అన్నారు. ధైర్యం, సహనశీలత, ప్రేమ అలవడతాయని పేర్కొన్నారు.

  • 'సరైన సమయం చూసుకొని రాజకీయాలలో అడుగు పెడతా'

సినీనటి నమిత తిరుమలలో రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు సినిమాల కంటే రాజకీయాలపై ఎక్కువ ఆసక్తి ఉందని.. సరైన సమయం చూసుకుని రాజకీయాలలో అడుగు పెడతానని నమిత తెలిపారు.

  • ఐటీబీపీ సిబ్బందికి జూడో, కరాటే, మార్షల్ ఆర్ట్స్​లో ట్రైనింగ్​

చైనా సైన్యంతో చోటు చేసుకున్న గల్వాన్‌ ఘర్షణ అనుభవాల దృష్ట్యా వాస్తవాధీన రేఖ వద్ద పహారాకాసే ఐటీబీపీ జవాన్లకు మూడు నెలల పాటు సరికొత్త శిక్షణా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. జూడో, కరాటే వంటి మార్షల్‌ ఆర్ట్స్‌ సహా విభిన్నమైన నిరాయుధ పోరాట రీతుల్లో ముమ్మర శిక్షణ ఇవ్వనున్నారు.

  • 'జర్నలిస్టులకు నగదు పంపలేదు..

దీపావళి కానుకగా జర్నలిస్టులకు నగదు పంపినట్లు తనపై వచ్చిన ఆరోపణలపై కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై స్పందించారు. జర్నలిస్టులకు తాను ఎటువంటి నగదును పంపించలేదని స్పష్టం చేశారు.

  • సఫారీలతో మ్యాచ్‌.. భారీ రికార్డుపై కన్నేసిన కోహ్లీ..

ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో అందరి దృష్టి కింగ్‌ కోహ్లీ పైనే. దాయాది పాక్‌పై.. ఆ తర్వాత నెదర్లాండ్స్‌పై కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించిన విరాట్‌.. ఈ మ్యాచ్‌లో పలు రికార్డులపై కన్నేశాడు.

  • 'సామ్​ అద్భుతమైన అమ్మాయి'

మయోసైటిస్​తో బాధపడుతున్న అగ్ర కథానాయిక సమంత త్వరగా కోలుకోవాలని మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు. జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయని, వాటివల్ల మనకెంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో తెలుస్తుందంటూ ఆయన ట్వీట్​ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.