ETV Bharat / state

TS Cabinet Meeting : పలు కీలక నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం

author img

By

Published : Dec 10, 2022, 2:23 PM IST

Updated : Dec 10, 2022, 10:30 PM IST

TS Cabinet Meeting: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్​ అధ్యక్షతన ప్రగతిభవన్​లో జరిగిన ఈ భేటీ సుమారు 5 గంటల పాటు సాగింది. పోలీస్ సైబర్ టీమ్ బలోపేతం కోసం భారీ రిక్రూట్​మెంట్ సహా రైతుబంధు నిధుల విడుదల, ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షల ఆర్థిక సాయం, పోడు భూములు సహా పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు.

TS Cabinet Meeting
TS Cabinet Meeting

TS Cabinet Meeting: ప్రగతి భవన్​లో రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం కేసీఆర్​ అధ్యక్షతన దాదాపు ఐదు గంటల పాటు జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి పెరుగుతున్న జనాభా, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా పోలీసు శాఖలో కొత్తగా సైబర్‌ సేఫ్టీ బ్యూరో పరిధిలో 3,966 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2,591 పోస్టులను బీసీ సంక్షేమశాఖలోని గురుకులాల్లో భర్తీ చేయాలని నిర్ణయించింది. ఆర్ అండ్ బీ శాఖలోని పలు విభాగాల్లో మొత్తం 472 అదనపు పోస్టులు మంజూరు చేస్తూ మంత్రి వర్గం తీర్మానించింది. అలాగే ఇంకా కొన్ని ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపారు. వీటితో పాటు పాటు రైతుబంధు నిధుల విడుదల, ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షల ఆర్థిక సాయం, పోడు భూములు, ఆర్​ అండ్​ బీతో సహా పలు కీలక అంశాలపై మంత్రిమండలి చర్చించింది. మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ప్రారంభమైన భేటీ రాత్రి ఏడున్నర వరకు కొనసాగింది.

సమావేశంలో శాసనసభ సమావేశాలు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, బీఆర్‌ఎస్‌ లక్ష్యాలు, కార్యాచరణ, కేంద్రం ఆంక్షలపై కూడా చర్చించారని సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు వంటి అంశాలు కూడా కేబినెట్‌లో చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులకు మూడు డీఏలు ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో మంజూరు అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.

కేబినేట్​ నిర్ణయాలు: రోడ్లు భవనాల శాఖలో పెరుగుతున్న పని విస్తృతికి అనుగుణంగా శాఖలోని పలు విభాగాలను పటిష్టం చేయాలని కేబినెట్​ నిర్ణయం తీసుకుంది. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చి.. రోడ్లు భవనాల శాఖలో అధికార వికేంద్రీకరణకు కేబినేట్​ ఆమోదం తెలిపింది. ఆర్​ అండ్​ బీలో అదనపు ఉద్యోగ నియామకాలను చేపట్టి.. అవసరమైన మేరకు నూతన కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అదనపు ఉద్యోగాలు, కార్యాలయాల కోసం అదనపు నిధులు మంజూరు చేశారు. కొత్తగా 3 సీఈ, 12 ఎస్ ఈ, 13ఈఈ, 102 డీఈఈ, 163 ఏఈఈ, 28 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులతో పాటు పలు టెక్నికల్ , నాన్ టెక్నికల్ సిబ్బంది పోస్టులు మంజూరు చేయడానికి గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారు. ఆర్ అండ్ బీలో సత్వరమే పదోన్నతులు, నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని ఆజ్ఞాపించారు. ఆర్ అండ్ బి శాఖలోనూ, రోడ్లు, భవనాలు, ఎలక్ట్రికల్, జాతీయ రహదారుల విభాగాల్లో... 3 చీఫ్ ఇంజినీర్ కార్యాలయాలు., 10 సర్కిల్ కార్యాలయాలు., 13 డివిజన్ కార్యాలయాలు., 79 సబ్ డివిజన్ కార్యాలయాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. అందుకుగానూ ఆర్ అండ్ బీ శాఖకు అదనంగా నిధులను కేటాయించారు.

రోడ్లు మరమ్మత్తుకు రూ.1865 కోట్లు మంజూరు: రాష్ట్రంలోని రోడ్లు మరమ్మతుల కోసం రూ.1865 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వానలు, తదితర ప్రకృతి వైపరీత్యాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు మరమ్మతులు, తక్షణ పనులకు గాను.. రూ. 635 కోట్ల కేటాయించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు వీలుగా కింద డీఈఈ నుంచి పైస్థాయి సీఈ వరకు స్వతంత్ర నిర్ణయాధికారాలు తీసుకోవడానికి కేబినెట్​ ఆమోదం ముద్ర వేసింది. ఇంజినీర్లు అత్యవసర పనుల కోసం ఏడాదికి 129 కోట్లు కేటాయిస్తూ తీర్మానించారు. భవనాల విభాగంలో కూడా అత్యవసర సమయాల్లో రిపేర్లు, తదితర ప్రజావసరాల కోసం ఖర్చు చేసేందుకు అవకాశం కల్పించారు. అత్యవసర పనులు చేపట్టేందుకు పరిమిత నిధులతో స్వీయ నిర్ణయాధికారాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఇవీ చూడండి:

టెండర్లు పిలవడం అంతరిక్ష సమస్యా?.. బాసర ట్రిపుల్ ఐటీ సిబ్బందిపై కేటీఆర్ ఫైర్

రాష్ట్రపతి విడిదికి బొల్లారం నిలయం ముస్తాబు

Last Updated :Dec 10, 2022, 10:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.