ETV Bharat / state

Telangana Schools Getting 2 Days Holidays: తెలంగాణలో విద్యార్థులకు ఆ 2 రోజులు సెలవులు..!

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2023, 3:43 PM IST

Telangana Schools Getting 2 Days Holidays : తెలంగాణలో విద్యార్థులకు వరుసగా రెండు రోజులు సెలవులు వస్తున్నాయి. అవి ఎప్పుడు..? ఎందుకో మీకు తెలుసా..?

Telangana Students Getting 2 Days Holidays
Telangana Students Getting 2 Days Holidays

Telangana Students Getting 2 Days Holidays : తెలంగాణలో విద్యార్థులకు వరుసగా సెలవులు వస్తూనే ఉన్నాయి. ఇటీవల వర్షాలు మొదలు వివిధ కారణాలతో విద్యాసంస్థలు మూతపడ్డాయి. తాజాగా మరోసారి సెలవుల అంశం తెరమీదకు వచ్చింది. మరి, ఈ సారి ఎప్పుడు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Telangana Public Service Commission) ఆధ్వర్యంలో ఆగస్టులో నిర్వహించాల్సిన గ్రూప్ 2 పరీక్షలు.. వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలు.. అభ్యర్థుల ఆందోళన కారణంగా అర్థంతరంగా వాయిదా వేశారు. ఈ పరీక్షలను తిరిగి నవంబరు 2, 3 తేదీల్లో నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో.. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు టీఎస్​పీఎస్సీ ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లతో చర్చలు చేపడుతున్నారు.

TSPSC Group 2 Exam Reschedule Dates : గ్రూప్‌- 2 పరీక్ష రీషెడ్యూల్‌.. కొత్త తేదీలివే

పరీక్షలు రాయబోతున్న అభ్యర్థులు 5 లక్షల మంది..

5 Lakh Candidates Going to Write Group 2 Exams : టీఎస్​పీఎస్సీ మొత్తం 783 గ్రూప్-2 పోస్టులకు పరీక్షలు నిర్వహించనుంది. ఈ పరీక్షలకు 5లక్షల 51 వేల 943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అభ్యర్థుల ఎంపిక పరీక్షను ఓఎంఆర్‌ పద్ధతిలో తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ నిర్వహించనుంది. గతంలో పేపర్ లీకేజీ వ్యవహారం కారణంగా ఎంతటి దుమారం చెలరేగిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఈసారి మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ పరీక్షలు నిర్వహించాలని టీఎస్​పీఎస్సీ భావిస్తోంది. తద్వారా.. ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వకూడదని బలమైన కసరత్తు చేస్తోంది.

KTR Tweet On Postponement TSPSC Group-2 Exam : గ్రూప్‌- 2 పరీక్ష రీషెడ్యూల్‌కు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం

విద్యాసంస్థలకు 2 రోజుల సెలవులు..

2 Days Holidays For Schools : గ్రూప్-2 పరీక్షలకు పెద్ద ఎత్తున పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే.. ఈ పరీక్షా కేంద్రాలన్నీ పాఠశాలల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. దీంతో.. ఆయా విద్యాసంస్థల్లో తరగతుల నిర్వహణ సాధ్యం కాదు. అందుకే.. ఎక్కడైతే పరీక్షలు నిర్వహించనున్నారో.. ఆయా పాఠశాలలకు సెలవులు మంజూరు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

నవంబరు 2వ తేదీ గురువారం అవుతుండగా.. 3వ తేదీ శుక్రవారం అవుతోంది. ఈ రెండు రోజులు సెలవులు మంజూరు చేయనున్నారు. అయితే.. ఈ సెలవులు అన్ని విద్యాసంస్థలకు కాదు. పరీక్షా కేంద్రాలుగా ఉన్న విద్యాసంస్థలకు మాత్రమేనని అధికారులు ప్రకటించారు.

గుడ్ న్యూస్.. మరో 2,391 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.